Psalms · chapter 103 · verse 14
Psalm 103:14 in Telugu
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.
Manamu nirmimpabadina reeti aayanaku teliseyunnadi manamu mantivaaramani aayana jnyaapakamu chesikonu chunnaadu.
Psalm 103:14 in English
- King James Version (KJV)
- For he knoweth our frame; he remembereth that we [are] dust.
- World English Bible (WEB)
- For he knows how we are made. He remembers that we are dust.
- American Standard Version (ASV)
- For he knoweth our frame; He remembereth that we are dust.
- Bible in Basic English (BBE)
- For he has knowledge of our feeble frame; he sees that we are only dust.
- Darby Translation (DBY)
- For himself knoweth our frame; he remembereth that we are dust.
- Webster's Bible (WBS)
- For he knoweth our frame; he remembereth that we [are] dust.
- Young's Literal Translation (YLT)
- For He hath known our frame, Remembering that we [are] dust.
Read in context
- 12పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు.
- 13తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
- 14మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.
- 15నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
- 16దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.
Cross references
- Ecclesiastes 12:7 ప్రసంగి 12:7మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.
- Job 10:9 యోబు 10:9జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
- Psalm 78:38–39 కీర్తనలు 78:38–39అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు. కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
- Genesis 3:19 ఆదికాండము 3:19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
- Psalm 89:47 కీర్తనలు 89:47నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
- Job 7:21 యోబు 7:21నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
- Job 7:5–7 యోబు 7:5–7నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు.
- Job 13:25 యోబు 13:25ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
- Isaiah 29:16 యెషయా 29:16అయ్యో, మీరెంత మూర్ఖులు? కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసినవారిగూర్చిఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిగూర్చి ఇతనికి బుద్ధిలేదనవచ్చునా?