Psalms · chapter 78 · verse 38
Psalm 78:38 in Telugu
అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
Ayite aayana vaatsalyasampoornudai vaarini nashimpajeyaka vaari doshamu pariharinchu vaadu. Tana ugratanu emaatramunu repukonaka palumaaru kopamu anachukonuvaadu.
Psalm 78:38 in English
- King James Version (KJV)
- But he, [being] full of compassion, forgave [their] iniquity, and destroyed [them] not: yea, many a time turned he his anger away, and did not stir up all his wrath.
- World English Bible (WEB)
- But he, being merciful, forgave iniquity, and didn’t destroy them. Yes, many times he turned his anger away, and didn’t stir up all his wrath.
- American Standard Version (ASV)
- But he, being merciful, forgave [their] iniquity, and destroyed [them] not: Yea, many a time turned he his anger away, And did not stir up all his wrath.
- Bible in Basic English (BBE)
- But he, being full of pity, has forgiveness for sin, and does not put an end to man: frequently turning back his wrath, and not being violently angry.
- Darby Translation (DBY)
- But he was merciful: he forgave the iniquity, and destroyed [them] not; but many a time turned he his anger away, and did not stir up all his fury:
- Webster's Bible (WBS)
- But he, [being] full of compassion, forgave [their] iniquity, and destroyed [them] not: yes, many a time he turned his anger away, and did not stir up all his wrath.
- Young's Literal Translation (YLT)
- And He — the Merciful One, Pardoneth iniquity, and destroyeth not, And hath often turned back His anger, And waketh not up all His fury.
Read in context
- 36అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
- 37నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
- 38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
- 39కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
- 40అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
Cross references
- Ezekiel 20:17 యెహెజ్కేలు 20:17అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.
- Numbers 14:18–20 సంఖ్యాకాండము 14:18–20దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించి యున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా యెహోవానీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.
- Isaiah 48:9 యెషయా 48:9నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామ మునుబట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టు కొనుచున్నాను.
- Isaiah 44:21–22 యెషయా 44:21–22యాకోబూ, ఇశ్రాయేలూ; వీటిని జ్ఞాపకము చేసికొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలూ, నీవు నాకు సేవకుడవై యున్నావు నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
- 2 Kings 21:20 2 రాజులు 21:20అతడు తన తండ్రియైన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.
- Ezekiel 20:13–14 యెహెజ్కేలు 20:13–14అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామ మునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.
- Ezekiel 20:21–22 యెహెజ్కేలు 20:21–22అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.
- Exodus 34:6–9 నిర్గమకాండము 34:6–9అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేలవరకు తలవంచుకొని నమస్కారముచేసి ప్రభువా, నామీద నీకు కటాక్షము కలిగినయెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతోకూడ రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు, మా దోషమును పాపమున
- Psalm 106:43–45 కీర్తనలు 106:43–45అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి. అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
- Ezekiel 20:8–9 యెహెజ్కేలు 20:8–9అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని. అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.
- Numbers 16:44–48 సంఖ్యాకాండము 16:44–48యెహోవామీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషేనీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను.