Psalms · chapter 108 · verse 13
Psalm 108:13 in Telugu
దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
Devunivalana memu shoorakaaryamulu jariginchedamu maa shatruvulanu anagadrokkuvaadu aayane.
Psalm 108:13 in English
- King James Version (KJV)
- Through God we shall do valiantly: for he [it is that] shall tread down our enemies.
- World English Bible (WEB)
- Through God, we will do valiantly, for it is he who will tread down our enemies.
- American Standard Version (ASV)
- Through God we shall do valiantly: For he it is that will tread down our adversaries.
- Bible in Basic English (BBE)
- With God we will do great things; for by him will our haters be crushed underfoot.
- Darby Translation (DBY)
- Through God we shall do valiantly; and he it is that will tread down our adversaries.
- Webster's Bible (WBS)
- Through God we shall do valiantly: for he will tread down our enemies.
- Young's Literal Translation (YLT)
- In God we do mightily, And He doth tread down our adversaries!
Read in context
- 11దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా?
- 12మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము
- 13దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
Cross references
- Psalm 118:6–13 కీర్తనలు 118:6–13యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
- Psalm 60:12 కీర్తనలు 60:12దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.
- Romans 16:20 రోమీయులకు 16:20సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
- Isaiah 63:3 యెషయా 63:3ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని, జనములలో ఎవడును నాతోకూడ ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కితిని రౌద్రముచేత వారిని అణగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రములమీద చిందినది, నా బట్టలన్నియు డాగులే.
- Psalm 18:29–34 కీర్తనలు 18:29–34నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.
- 2 Corinthians 2:14 2 కొరింథీయులకు 2:14మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
- Psalm 18:42 కీర్తనలు 18:42అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టితినివీధుల పెంటను ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితిని.
- Psalm 144:1 కీర్తనలు 144:1నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.
- 1 Corinthians 15:10 1 కొరింథీయులకు 15:10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
- Judges 15:8 న్యాయాధిపతులు 15:8తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
- Ephesians 6:10–18 ఎఫెసీయులకు 6:10–18తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
- Isaiah 25:10 యెషయా 25:10యెహోవా హస్తము ఈ పర్వతముమీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు.