Psalms · chapter 111 · verse 3
Psalm 111:3 in Telugu
ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
Aayana kaaryamu mahimaa prabhaavamulu galadi aayana neeti nityamu nilukadagaa nundunu.
Psalm 111:3 in English
- King James Version (KJV)
- His work [is] honourable and glorious: and his righteousness endureth for ever.
- World English Bible (WEB)
- His work is honor and majesty. His righteousness endures forever.
- American Standard Version (ASV)
- His work is honor and majesty; And his righteousness endureth for ever.
- Bible in Basic English (BBE)
- His work is full of honour and glory; and his righteousness is unchanging for ever.
- Darby Translation (DBY)
- His work is majesty and splendour, and his righteousness abideth for ever.
- Webster's Bible (WBS)
- His work [is] honorable and glorious: and his righteousness endureth for ever.
- Young's Literal Translation (YLT)
- Honourable and majestic is His work, And His righteousness is standing for ever.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
- 2యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టముగల వారందరు వాటిని విచారించు దురు.
- 3ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును.
- 4ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
- 5తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చి యున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును.
Cross references
- Psalm 145:4–5 కీర్తనలు 145:4–5ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
- Psalm 145:10–12 కీర్తనలు 145:10–12యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
- Ephesians 3:10 ఎఫెసీయులకు 3:10శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును అన్యజనులలో ప్రకటించుటకును,
- Revelation 5:12–14 ప్రకటన 5:12–14వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
- Psalm 119:142 కీర్తనలు 119:142నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
- Exodus 15:11 నిర్గమకాండము 15:11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
- Psalm 103:17 కీర్తనలు 103:17ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
- Ephesians 1:6–8 ఎఫెసీయులకు 1:6–8మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
- Isaiah 51:8 యెషయా 51:8వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దీక గొఱ్ఱెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.
- Psalm 19:1 కీర్తనలు 19:1ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
- Daniel 9:24 దానియేలు 9:24తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణము నకును డెబ్బదివారములు విధింపబడెను.
- Psalm 112:3 కీర్తనలు 112:3కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.