Psalms · chapter 145 · verse 4
Psalm 145:4 in Telugu
ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
Oka taramuvaaru mariyoka taramuvaariyeduta nee kriyalanu koniyaaduduru nee paraakramakriyalanu teliyajeyuduru
Psalm 145:4 in English
- King James Version (KJV)
- One generation shall praise thy works to another, and shall declare thy mighty acts.
- World English Bible (WEB)
- One generation will commend your works to another, and will declare your mighty acts.
- American Standard Version (ASV)
- One generation shall laud thy works to another, And shall declare thy mighty acts.
- Bible in Basic English (BBE)
- One generation after another will give praise to your great acts, and make clear the operation of your strength.
- Darby Translation (DBY)
- One generation shall laud thy works to another, and shall declare thy mighty acts.
- Webster's Bible (WBS)
- One generation shall praise thy works to another, and shall declare thy mighty acts.
- Young's Literal Translation (YLT)
- Generation to generation praiseth Thy works, And Thy mighty acts they declare.
Read in context
- 2అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
- 3యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
- 4ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు
- 5మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను
- 6నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
Cross references
- Psalm 71:18 కీర్తనలు 71:18దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.
- Psalm 78:3–7 కీర్తనలు 78:3–7మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును
- Isaiah 38:19 యెషయా 38:19సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు యెహోవా నన్ను రక్షించువాడు
- Deuteronomy 6:7 ద్వితీయోపదేశకాండము 6:7నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
- Joshua 4:21–24 యెహోషువ 4:21–24ఇశ్రాయేలీయులతో ఇట్లనెనురాబోవు కాలమున మీ సంతతివారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురుగదా; అప్పుడు మీరుఇశ్రా యేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసు లందరు తెలిసికొనుటకును, మీరు ఎల్లప్పుడును మీ దేవు డైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటువరకు మీ దేవుడైన యెహోవా తానే మాయెదుట ఎఱ్ఱసముద్రమును ఎండచేసినట్లు మీరు దాటువరకు మీ యెదుట యొర్దాను నీళ్ళను ఎండచేసెనని చెప్పి యీ సంగతి వారికి తెలియపరచవలెను.
- Psalm 44:1–2 కీర్తనలు 44:1–2దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.
- Exodus 12:26–27 నిర్గమకాండము 12:26–27మరియు మీకుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.
- Exodus 13:14–15 నిర్గమకాండము 13:14–15ఇకమీదట నీ కుమారుడు - ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి - బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.