Psalms · chapter 113 · verse 1
Psalm 113:1 in Telugu
యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
Yehovaanu stutinchudi yehovaa sevakulaaraa, aayananu stutinchudi. Yehovaa naamamunu stutinchudi.
Psalm 113:1 in English
- King James Version (KJV)
- Praise ye the LORD. Praise, O ye servants of the LORD, praise the name of the LORD.
- World English Bible (WEB)
- Praise the LORD! Praise, you servants of the LORD, praise the LORD’s name.
- American Standard Version (ASV)
- Praise ye Jehovah. Praise, O ye servants of Jehovah, Praise the name of Jehovah.
- Bible in Basic English (BBE)
- Let the Lord be praised. O you servants of the Lord, give praise to the name of the Lord.
- Darby Translation (DBY)
- Hallelujah! Praise, ye servants of Jehovah, praise the name of Jehovah.
- Webster's Bible (WBS)
- Praise ye the LORD. Praise, O ye servants of the LORD, praise the name of the LORD.
- Young's Literal Translation (YLT)
- Praise ye Jah! Praise, ye servants of Jehovah. Praise the name of Jehovah.
Read in context
- 1యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
- 2ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
- 3సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
Cross references
- Ephesians 5:19–20 ఎఫెసీయులకు 5:19–20ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
- Psalm 135:1–3 కీర్తనలు 135:1–3యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
- Psalm 135:20 కీర్తనలు 135:20లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహోవాను సన్నుతించుడి.
- Psalm 145:10 కీర్తనలు 145:10యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు.
- Psalm 134:1 కీర్తనలు 134:1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
- Psalm 103:20–21 కీర్తనలు 103:20–21యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.
- Psalm 69:36 కీర్తనలు 69:36ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు.
- Psalm 112:1 కీర్తనలు 112:1యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
- Psalm 34:22 కీర్తనలు 34:22యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.
- Psalm 33:1–2 కీర్తనలు 33:1–2నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి
- Revelation 19:5 ప్రకటన 19:5మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.