Psalms · chapter 116 · verse 2
Psalm 116:2 in Telugu
ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
Aayana naaku cheviyoggenu kaavuna naa jeevitakaalamantayu nenaayanaku morra pettudunu
Psalm 116:2 in English
- King James Version (KJV)
- Because he hath inclined his ear unto me, therefore will I call upon [him] as long as I live.
- World English Bible (WEB)
- Because he has turned his ear to me, therefore I will call on him as long as I live.
- American Standard Version (ASV)
- Because he hath inclined his ear unto me, Therefore will I call [upon him] as long as I live.
- Bible in Basic English (BBE)
- He has let my request come before him, and I will make my prayer to him all my days.
- Darby Translation (DBY)
- For he hath inclined his ear unto me, and I will call upon him during [all] my days.
- Webster's Bible (WBS)
- Because he hath inclined his ear to me, therefore will I call upon [him] as long as I live.
- Young's Literal Translation (YLT)
- Because He hath inclined His ear to me, And during my days I call.
Read in context
- 1యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
- 2ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- 3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
- 4అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
Cross references
- Psalm 145:18–19 కీర్తనలు 145:18–19తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.
- Psalm 40:1 కీర్తనలు 40:1యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- Psalm 55:16–17 కీర్తనలు 55:16–17అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
- Psalm 86:6–7 కీర్తనలు 86:6–7యెహోవా, నా ప్రార్థనకు చెవి యొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము, నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొఱ్ఱ పెట్టెదను.
- Luke 18:1 లూకా 18:1వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
- Psalm 31:2 కీర్తనలు 31:2నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.
- Colossians 4:2 కొలొస్సయులకు 4:2ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.
- Psalm 88:1 కీర్తనలు 88:1యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
- Job 27:10 యోబు 27:10వాడు సర్వశక్తునియందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?