Psalms · chapter 40 · verse 1
Psalm 40:1 in Telugu
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
Yehovaakoraku nenu sahanamuto kanipettu kontini aayana naaku cheviyoggi naa morra aalakinchenu.
Psalm 40:1 in English
- King James Version (KJV)
- To the chief Musician, A Psalm of David. I waited patiently for the LORD; and he inclined unto me, and heard my cry.
- World English Bible (WEB)
- For the Chief Musician. A Psalm by David. I waited patiently for the LORD. He turned to me, and heard my cry.
- American Standard Version (ASV)
- For the Chief Musician. A Psalm of David. I waited patiently for Jehovah; And he inclined unto me, and heard my cry.
- Bible in Basic English (BBE)
- To the chief music-maker. Of David. A Psalm. When I was waiting quietly for the Lord, his heart was turned to me, and he gave ear to my cry.
- Darby Translation (DBY)
- To the chief Musician. Of David. A Psalm. I waited patiently for Jehovah; and he inclined unto me, and heard my cry.
- Webster's Bible (WBS)
- To the chief Musician, A Psalm of David. I waited patiently for the LORD; and he inclined to me, and heard my cry.
- Young's Literal Translation (YLT)
- To the Overseer. — A Psalm of David. I have diligently expected Jehovah, And He inclineth to me, and heareth my cry,
Read in context
- 1యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
- 2నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
- 3తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
Cross references
- Psalm 27:13–14 కీర్తనలు 27:13–14సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
- Psalm 37:7 కీర్తనలు 37:7యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము.
- James 5:7–11 యాకోబు 5:7–11సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవ మునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.
- Psalm 116:2 కీర్తనలు 116:2ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- Psalm 34:15 కీర్తనలు 34:15యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
- Psalm 130:2 కీర్తనలు 130:2ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
- Daniel 9:18 దానియేలు 9:18నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.