Psalms · chapter 118 · verse 24
Psalm 118:24 in Telugu
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
Idi yehovaa erpaatu chesina dinamu deeniyandu manamu utsahinchi santoshinchedamu.
Psalm 118:24 in English
- King James Version (KJV)
- This [is] the day [which] the LORD hath made; we will rejoice and be glad in it.
- World English Bible (WEB)
- This is the day that the LORD has made. We will rejoice and be glad in it!
- American Standard Version (ASV)
- This is the day which Jehovah hath made; We will rejoice and be glad in it.
- Bible in Basic English (BBE)
- This is the day which the Lord has made; we will be full of joy and delight in it.
- Darby Translation (DBY)
- This is the day that Jehovah hath made; we will rejoice and be glad in it.
- Webster's Bible (WBS)
- This [is] the day [which] the LORD hath made; we will rejoice and be glad in it.
- Young's Literal Translation (YLT)
- This [is] the day Jehovah hath made, We rejoice and are glad in it.
Read in context
- 22ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
- 23అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
- 24ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
- 25యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
- 26యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
Cross references
- Psalm 84:10 కీర్తనలు 84:10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
- Isaiah 58:13 యెషయా 58:13నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయ కయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల
- Nehemiah 8:10 నెహెమ్యా 8:10మరియు అతడు వారితో నిట్లనెనుపదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖ పడకుడి, యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
- 2 Chronicles 20:26–28 2 దినవృత్తాంతములు 20:26–28నాల్గవ దినమున వారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా లోయ యని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అను గ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషా పాతును సాగి వెళ్లిరి; వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.
- Revelation 1:10 ప్రకటన 1:10ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
- 1 Kings 8:66 1 రాజులు 8:66ఎనిమిదవ దినమున అతడు జను లకు సెలవియ్యగా, వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులగు తన జను లకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్లి పోయిరి.
- John 20:19–20 యోహాను 20:19–20ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
- Acts 20:7 అపొస్తలుల కార్యములు 20:7ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.
- Matthew 28:1–8 మత్తయి 28:1–8విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
- Zechariah 3:9 జెకర్యా 3:9యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;