Psalms · chapter 119 · verse 58
Psalm 119:58 in Telugu
కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
Kataakshamunchumani naa poornahrudayamuto ninnu batimaalukonuchunnaanu neevichchina maatachoppuna nannu karunimpumu.
Psalm 119:58 in English
- King James Version (KJV)
- I intreated thy favour with [my] whole heart: be merciful unto me according to thy word.
- World English Bible (WEB)
- I sought your favor with my whole heart. Be merciful to me according to your word.
- American Standard Version (ASV)
- I entreated thy favor with my whole heart: Be merciful unto me according to thy word.
- Bible in Basic English (BBE)
- I have given my mind to do your pleasure with all my heart; have mercy on me, as you have said.
- Darby Translation (DBY)
- I have sought thy favour with [my] whole heart: be gracious unto me according to thy *word.
- Webster's Bible (WBS)
- I entreated thy favor with [my] whole heart: be merciful to me according to thy word.
- Young's Literal Translation (YLT)
- I appeased Thy face with the whole heart, Favour me according to Thy saying.
Read in context
- 56నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.
- 57(హేత్)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.
- 58కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
- 59నా మార్గములు నేను పరిశీలన చేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.
- 60నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.
Cross references
- Psalm 119:41 కీర్తనలు 119:41(వావ్) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
- Hebrews 10:22 హెబ్రీయులకు 10:22మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Psalm 119:170 కీర్తనలు 119:170నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.
- Psalm 119:10 కీర్తనలు 119:10నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
- Psalm 4:6 కీర్తనలు 4:6మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
- 1 Kings 13:6 1 రాజులు 13:6అప్పుడు రాజునా చెయ్యి మునుపటివలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నాకొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటివలె ఆయెను.
- Psalm 27:8 కీర్తనలు 27:8నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.
- Psalm 138:2 కీర్తనలు 138:2నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయు చున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు నేను చెల్లించెదను.
- Psalm 56:4 కీర్తనలు 56:4దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
- Matthew 24:35 మత్తయి 24:35ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.
- Psalm 56:10 కీర్తనలు 56:10దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను
- Psalm 119:65 కీర్తనలు 119:65యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.