Psalms · chapter 119 · verse 94
Psalm 119:94 in Telugu
నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.
Nee upadeshamulanu nenu vedakuchunnaanu nenu neevaadane nannu rakshinchumu.
Psalm 119:94 in English
- King James Version (KJV)
- I [am] thine, save me; for I have sought thy precepts.
- World English Bible (WEB)
- I am yours. Save me, for I have sought your precepts.
- American Standard Version (ASV)
- I am thine, save me; For I have sought thy precepts.
- Bible in Basic English (BBE)
- I am yours, O be my saviour; for my desire has been for your rules.
- Darby Translation (DBY)
- I am thine, save me; for I have sought thy precepts.
- Webster's Bible (WBS)
- I [am] thine, save me; for I have sought thy precepts.
- Young's Literal Translation (YLT)
- I [am] Thine, save Thou me, For Thy precepts I have sought.
Read in context
- 92నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
- 93నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.
- 94నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.
- 95నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
- 96సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది.
Cross references
- Zephaniah 3:17 జెఫన్యా 3:17నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
- Acts 27:23–24 అపొస్తలుల కార్యములు 27:23–24నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
- Psalm 86:2 కీర్తనలు 86:2నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొనియున్న నీ సేవకుని రక్షిం పుము.
- Isaiah 64:8–10 యెషయా 64:8–10యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.
- Isaiah 44:2 యెషయా 44:2నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.
- Psalm 119:27 కీర్తనలు 119:27నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
- Isaiah 44:5 యెషయా 44:5ఒకడునేను యెహోవావాడననును, మరియొకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరియొకడు యెహోవావాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనును.
- Psalm 119:40 కీర్తనలు 119:40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- Joshua 10:4–6 యెహోషువ 10:4–6లాకీషురాజైన యాఫీయ యొద్దకును ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయుల అయిదుగురురాజులను, అనగా యెరూష లేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని, తామును తమ సేనలన్నియు బయలుదేరి, గిబియోను ముందర దిగి, గిబియోనీయులతో యుద్ధముచేసిరి. గిబియోనీయులుమన్యములలో నివసించు అమోరీయుల రాజులందరు కూడి మా మీదికిదండెత్తి వచ్చియున్నారు గనుక, నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మాయొద్దకు వచ్చి మాకు సహా యముచేసి మమ్మును రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాళెములో యెహోషువకు వర్తమానము పంపగా
- Psalm 119:173 కీర్తనలు 119:173నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
- Isaiah 41:8–10 యెషయా 41:8–10నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.