Psalms · chapter 136 · verse 13
Psalm 136:13 in Telugu
ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
Errasamudramunu aayana paayalugaa cheelchenu. Aayana krupa nirantaramundunu.
Psalm 136:13 in English
- King James Version (KJV)
- To him which divided the Red sea into parts: for his mercy [endureth] for ever:
- World English Bible (WEB)
- to him who divided the Red Sea apart, for his loving kindness endures forever;
- American Standard Version (ASV)
- To him that divided the Red Sea in sunder; For his lovingkindness [endureth] for ever;
- Bible in Basic English (BBE)
- To him who made a way through the Red Sea: for his mercy is unchanging for ever:
- Darby Translation (DBY)
- To him that divided the Red sea into parts, for his loving-kindness [endureth] for ever,
- Webster's Bible (WBS)
- To him who divided the Red sea into parts: for his mercy [endureth] for ever.
- Young's Literal Translation (YLT)
- To Him cutting the sea of Suph into parts, For to the age [is] His kindness,
Read in context
- 11వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును.
- 12చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.
- 13ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
- 14ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును.
- 15ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
Cross references
- Psalm 78:13 కీర్తనలు 78:13ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను
- Psalm 106:9–11 కీర్తనలు 106:9–11ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను. వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
- Exodus 14:29 నిర్గమకాండము 14:29అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.
- Isaiah 63:12–13 యెషయా 63:12–13తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి
- Psalm 74:13 కీర్తనలు 74:13నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి.
- Exodus 14:21–22 నిర్గమకాండము 14:21–22మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
- Hebrews 11:29 హెబ్రీయులకు 11:29విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
- Psalm 66:5–6 కీర్తనలు 66:5–6దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.