Psalms · chapter 136 · verse 15
Psalm 136:15 in Telugu
ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
Pharonu atani sainyamunu errasamudramulo aayana munchivesenu aayana krupa nirantaramundunu.
Psalm 136:15 in English
- King James Version (KJV)
- But overthrew Pharaoh and his host in the Red sea: for his mercy [endureth] for ever.
- World English Bible (WEB)
- but overthrew Pharaoh and his army in the Red Sea, for his loving kindness endures forever;
- American Standard Version (ASV)
- But overthrew Pharaoh and his host in the Red Sea; For his lovingkindness [endureth] for ever:
- Bible in Basic English (BBE)
- By him Pharaoh and his army were overturned in the Red Sea: for his mercy is unchanging for ever.
- Darby Translation (DBY)
- And overturned Pharaoh and his host in the Red sea, for his loving-kindness [endureth] for ever;
- Webster's Bible (WBS)
- But overthrew Pharaoh and his army in the Red sea: for his mercy [endureth] for ever.
- Young's Literal Translation (YLT)
- And shook out Pharaoh and his force in the sea of Suph, For to the age [is] His kindness.
Read in context
- 13ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
- 14ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును.
- 15ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
- 16అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును.
- 17గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
Cross references
- Psalm 78:53 కీర్తనలు 78:53వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
- Nehemiah 9:10–11 నెహెమ్యా 9:10–11ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వ ముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి. మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.
- Psalm 135:9 కీర్తనలు 135:9ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యోగస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరిగించెను.
- Exodus 14:27–28 నిర్గమకాండము 14:27–28మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
- Psalm 79:6–9 కీర్తనలు 79:6–9నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
- Psalm 65:5 కీర్తనలు 65:5మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు
- Luke 1:71–74 లూకా 1:71–74మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
- Exodus 15:4–5 నిర్గమకాండము 15:4–5ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.
- Psalm 143:12 కీర్తనలు 143:12నేను నీ సేవకుడను నీ కృపనుబట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధపరచువారినందరిని నశింప జేయుము.
- Exodus 15:10–13 నిర్గమకాండము 15:10–13నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను. నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.