Psalms · chapter 143 · verse 7
Psalm 143:7 in Telugu
యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
Yehovaa, naa aatma ksheeninchuchunnadi tvaragaa naaku uttaramimmu nenu samaadhiloniki diguvaarivale kaakundunatlu nee mukhamunu naaku marugucheyakumu
Psalm 143:7 in English
- King James Version (KJV)
- Hear me speedily, O LORD: my spirit faileth: hide not thy face from me, lest I be like unto them that go down into the pit.
- World English Bible (WEB)
- Hurry to answer me, LORD. My spirit fails. Don’t hide your face from me, so that I don’t become like those who go down into the pit.
- American Standard Version (ASV)
- Make haste to answer me, O Jehovah; my spirit faileth: Hide not thy face from me, Lest I become like them that go down into the pit.
- Bible in Basic English (BBE)
- Be quick in answering me, O Lord, for the strength of my spirit is gone: let me see your face, so that I may not be like those who go down into the underworld.
- Darby Translation (DBY)
- Answer me speedily, O Jehovah; my spirit faileth: hide not thy face from me, or I shall be like unto them that go down into the pit.
- Webster's Bible (WBS)
- Hear me speedily, O LORD: my spirit faileth: hide not thy face from me, lest I be like them that go down into the pit.
- Young's Literal Translation (YLT)
- Haste, answer me, O Jehovah, My spirit hath been consumed, Hide not Thou Thy face from me, Or I have been compared with those going down [to] the pit.
Read in context
- 5పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను
- 6నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశ పడుచున్నది.
- 7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
- 8నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.
- 9యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
Cross references
- Psalm 69:17 కీర్తనలు 69:17నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.
- Psalm 28:1 కీర్తనలు 28:1యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
- Psalm 27:9 కీర్తనలు 27:9నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము
- Psalm 71:12 కీర్తనలు 71:12దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము
- Psalm 88:4–6 కీర్తనలు 88:4–6సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని. చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా. అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
- Isaiah 38:18 యెషయా 38:18పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.
- Psalm 70:5 కీర్తనలు 70:5నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నారక్షణకర్తవు నీవే యెహోవా, ఆలస్యము చేయకుమీ.
- Psalm 102:2 కీర్తనలు 102:2నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
- Psalm 69:3 కీర్తనలు 69:3నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
- Isaiah 8:17 యెషయా 8:17యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
- Psalm 40:17 కీర్తనలు 40:17నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
- Psalm 22:24 కీర్తనలు 22:24ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.