Psalms · chapter 88 · verse 4
Psalm 88:4 in Telugu
సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.
Samaadhiloniki diguvaarilo nenokanigaa enchabaditini. Nenu traanalenivaanivale ayitini.
Psalm 88:4 in English
- King James Version (KJV)
- I am counted with them that go down into the pit: I am as a man [that hath] no strength:
- World English Bible (WEB)
- I am counted among those who go down into the pit. I am like a man who has no help,
- American Standard Version (ASV)
- I am reckoned with them that go down into the pit; I am as a man that hath no help,
- Bible in Basic English (BBE)
- I am numbered among those who go down into the earth; I have become like a man for whom there is no help:
- Darby Translation (DBY)
- I am reckoned with them that go down into the pit; I am as a man that hath no strength:
- Webster's Bible (WBS)
- I am counted with them that go down into the pit: I am as a man [that hath] no strength:
- Young's Literal Translation (YLT)
- I have been reckoned with those going down [to] the pit, I have been as a man without strength.
Read in context
- 2నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక నా మొఱ్ఱకు చెవి యొగ్గుము
- 3నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.
- 4సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేనివానివలె అయితిని.
- 5చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు గదా.
- 6అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
Cross references
- Psalm 28:1 కీర్తనలు 28:1యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
- 2 Corinthians 1:9 2 కొరింథీయులకు 1:9మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
- Psalm 143:7 కీర్తనలు 143:7యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము
- Isaiah 38:17–18 యెషయా 38:17–18మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుకతట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయిం చరు.
- Psalm 31:12 కీర్తనలు 31:12మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.
- Job 17:1 యోబు 17:1నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను. సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
- 2 Corinthians 13:4 2 కొరింథీయులకు 13:4బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
- Psalm 30:9 కీర్తనలు 30:9మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
- Romans 5:6 రోమీయులకు 5:6ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.
- Jonah 2:6 యోనా 2:6నేను మరెన్న టికిని ఎక్కిరాకుండ భూమి గడియలు వేయబడియున్నవి; పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను, నా దేవా, యెహోవా, నీవు నా ప్రాణము కూపములోనుండి పైకి రప్పించియున్నావు.
- Psalm 109:22–24 కీర్తనలు 109:22–24నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది. సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.
- Ezekiel 26:20 యెహెజ్కేలు 26:20మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;