2 Samuel · chapter 22 · verse 11
2 Samuel 22:11 in Telugu
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
Keroobumeeda ekki aayana yegiri vachchenu. Gaali rekkalameeda pratyakshamaayenu.
2 Samuel 22:11 in English
- King James Version (KJV)
- And he rode upon a cherub, and did fly: and he was seen upon the wings of the wind.
- World English Bible (WEB)
- He rode on a cherub, and flew. Yes, he was seen on the wings of the wind.
- American Standard Version (ASV)
- And he rode upon a cherub, and did fly; Yea, he was seen upon the wings of the wind.
- Bible in Basic English (BBE)
- And he went through the air, seated on a storm-cloud: going quickly on the wings of the wind.
- Darby Translation (DBY)
- And he rode upon a cherub, and did fly; And he was seen upon the wings of the wind.
- Webster's Bible (WBS)
- And he rode upon a cherub, and flew: and he was seen upon the wings of the wind.
- Young's Literal Translation (YLT)
- And He rideth on a cherub, and doth fly, And is seen on the wings of the wind.
Read in context
- 9ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
- 10మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
- 11కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- 12గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
- 13ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
Cross references
- Psalm 104:3 కీర్తనలు 104:3జలములలో ఆయన తన గదుల దూలములను వేసి యున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు
- Psalm 18:10 కీర్తనలు 18:10కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- Hebrews 1:14 హెబ్రీయులకు 1:14వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
- Genesis 3:24 ఆదికాండము 3:24అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
- Psalm 99:1 కీర్తనలు 99:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
- Psalm 80:1 కీర్తనలు 80:1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- 1 Samuel 4:4 1 సమూయేలు 4:4కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూ బులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.
- Ezekiel 10:2–14 యెహెజ్కేలు 10:2–14అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను. కెరూబుల మధ్యనుండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను; అంతలో కెరూబుల రెక్కలక్రింద మానవ హస్తరూప మొకటి కనబడెను; నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్రములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్రమునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ నాలుగు కెరూబులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను. కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
- Psalm 68:17 కీర్తనలు 68:17దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
- Exodus 25:19 నిర్గమకాండము 25:19ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను
- Ezekiel 9:3 యెహెజ్కేలు 9:3ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపైనుండి దిగి మందిరపు గడప దగ్గరకువచ్చి నిలిచి, అవిసె నారబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా
- Psalm 139:9 కీర్తనలు 139:9నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను