Psalms · chapter 18 · verse 23
Psalm 18:23 in Telugu
దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
Doshakriyalu nenu cheyanollakuntini aayana drushtiki nenu yathaarthudanaitini.
Psalm 18:23 in English
- King James Version (KJV)
- I was also upright before him, and I kept myself from mine iniquity.
- World English Bible (WEB)
- I was also blameless with him. I kept myself from my iniquity.
- American Standard Version (ASV)
- I was also perfect with him, And I kept myself from mine iniquity.
- Bible in Basic English (BBE)
- And I was upright before him, and I kept myself from sin.
- Darby Translation (DBY)
- And I was upright with him, and kept myself from mine iniquity.
- Webster's Bible (WBS)
- I was also upright before him, and I kept myself from my iniquity.
- Young's Literal Translation (YLT)
- And I am perfect with him, And I keep myself from mine iniquity.
Read in context
- 21యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడచినవాడను కాను
- 22ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసినవాడను కాను
- 23దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
- 24కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
- 25దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
Cross references
- Matthew 5:29–30 మత్తయి 5:29–30నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.
- Matthew 18:8–9 మత్తయి 18:8–9కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.
- Psalm 37:27 కీర్తనలు 37:27కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
- Psalm 11:7 కీర్తనలు 11:7యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వాడుయథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.
- 1 Samuel 26:23 1 సమూయేలు 26:23యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును.
- 1 Chronicles 29:17 1 దినవృత్తాంతములు 29:17నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
- Psalm 17:3 కీర్తనలు 17:3రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివినన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను
- Psalm 7:1–8 కీర్తనలు 7:1–8యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను తరుమువారి చేతిలోనుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా(సెలా. ) యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనునప్పుడువారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.