Psalms · chapter 18 · verse 25
Psalm 18:25 in Telugu
దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
Dayagalavaariyedala neevu dayachoopinchuduvu yathaarthavantulayedala yathaarthavantudavugaa nunduvu
Psalm 18:25 in English
- King James Version (KJV)
- With the merciful thou wilt shew thyself merciful; with an upright man thou wilt shew thyself upright;
- World English Bible (WEB)
- With the merciful you will show yourself merciful. With the perfect man, you will show yourself perfect.
- American Standard Version (ASV)
- With the merciful thou wilt show thyself merciful; With the perfect man thou wilt show thyself perfect;
- Bible in Basic English (BBE)
- On him who has mercy you will have mercy; to the upright you will be upright;
- Darby Translation (DBY)
- With the gracious thou dost shew thyself gracious; with the upright man thou dost shew thyself upright;
- Webster's Bible (WBS)
- With the merciful thou wilt show thyself merciful; with an upright man thou wilt show thyself upright;
- Young's Literal Translation (YLT)
- With the kind Thou showest Thyself kind, With a perfect man showest Thyself perfect.
Read in context
- 23దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని.
- 24కావున యెహోవా నేను నిర్దోషిగానుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
- 25దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు
- 26సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపు దువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
- 27శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు.
Cross references
- Matthew 5:7 మత్తయి 5:7కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
- Psalm 62:12 కీర్తనలు 62:12ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
- Matthew 18:33–35 మత్తయి 18:33–35నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధ పరచువారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.
- Psalm 112:4–6 కీర్తనలు 112:4–6యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
- Psalm 41:1–4 కీర్తనలు 41:1–4బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
- 1 Kings 8:32 1 రాజులు 8:32నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయము తీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతిచొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.
- Nehemiah 9:17 నెహెమ్యా 9:17వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచు కొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంత మును బహు కృపయు గలవాడవునై యుండి వారిని విసర్జింపలేదు.
- Ezekiel 18:25–30 యెహెజ్కేలు 18:25–30అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది? నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియే గదా అతడు మరణమునొందును? మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
- Isaiah 57:1–2 యెషయా 57:1–2నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
- Romans 9:14 రోమీయులకు 9:14కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
- Isaiah 58:7–8 యెషయా 58:7–8నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
- Isaiah 26:7 యెషయా 26:7నీతిమంతులు పోవుమార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని