Psalms · chapter 24 · verse 3
Psalm 24:3 in Telugu
యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
Yehovaa parvatamunaku ekkadaginavaadevadu? Aayana parishuddha sthalamulo niluvadaginavaadevadu?
Psalm 24:3 in English
- King James Version (KJV)
- Who shall ascend into the hill of the LORD? or who shall stand in his holy place?
- World English Bible (WEB)
- Who may ascend to the LORD’s hill? Who may stand in his holy place?
- American Standard Version (ASV)
- Who shall ascend into the hill of Jehovah? And who shall stand in his holy place?
- Bible in Basic English (BBE)
- Who may go up into the hill of the Lord? and who may come into his holy place?
- Darby Translation (DBY)
- Who shall ascend into the mount of Jehovah? and who shall stand in his holy place?
- Webster's Bible (WBS)
- Who shall ascend upon the hill of the LORD? and who shall stand in his holy place?
- Young's Literal Translation (YLT)
- Who goeth up into the hill of Jehovah? And who riseth up in His holy place?
Read in context
- 1భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
- 2ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దాని స్థిరపరచెను.
- 3యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
- 4వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
- 5వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.
Cross references
- Psalm 15:1 కీర్తనలు 15:1యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
- Hebrews 12:28 హెబ్రీయులకు 12:28అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,
- Psalm 2:6 కీర్తనలు 2:6నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
- Psalm 65:4 కీర్తనలు 65:4నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము.
- Malachi 3:1 మలాకీ 3:1ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- Psalm 68:18 కీర్తనలు 68:18నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.
- Hebrews 12:22–24 హెబ్రీయులకు 12:22–24ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్య వర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు.
- Psalm 132:13–14 కీర్తనలు 132:13–14యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
- 2 Samuel 6:12–17 2 సమూయేలు 6:12–17దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను, దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను. ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.
- Leviticus 10:3 లేవీయకాండము 10:3అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెనుఇది యెహోవా చెప్పిన మాటనాయొద్దనుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచు కొందును; ప్రజలందరియెదుట నన్ను మహిమపరచు కొందును;
- Psalm 68:15–16 కీర్తనలు 68:15–16బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము. శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.
- Psalm 78:68–69 కీర్తనలు 78:68–69యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను