Psalms · chapter 26 · verse 3
Psalm 26:3 in Telugu
నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
Nee krupa naa kannulayeduta nunchukoniyunnaanu nee satyamu nanusarinchi naduchukonuchunnaanu
Psalm 26:3 in English
- King James Version (KJV)
- For thy lovingkindness [is] before mine eyes: and I have walked in thy truth.
- World English Bible (WEB)
- For your loving kindness is before my eyes. I have walked in your truth.
- American Standard Version (ASV)
- For thy lovingkindness is before mine eyes; And I have walked in thy truth.
- Bible in Basic English (BBE)
- For your mercy is before my eyes; and I have gone in the way of your good faith.
- Darby Translation (DBY)
- For thy loving-kindness is before mine eyes, and I have walked in thy truth.
- Webster's Bible (WBS)
- For thy loving-kindness [is] before my eyes: and I have walked in thy truth.
- Young's Literal Translation (YLT)
- For Thy kindness [is] before mine eyes, And I have walked habitually in Thy truth.
Read in context
- 1యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను.
- 2యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.
- 3నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
- 4పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను.
- 5దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను
Cross references
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- 2 Kings 20:3 2 రాజులు 20:3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
- 2 Corinthians 8:9 2 కొరింథీయులకు 8:9మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.
- 2 John 1:4 2 యోహాను 1:4తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.
- 1 John 4:19–21 1 యోహాను 4:19–21ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలె నను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
- 2 Corinthians 3:18 2 కొరింథీయులకు 3:18మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
- 3 John 1:3–4 3 యోహాను 1:3–4నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.
- John 14:6 యోహాను 14:6యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
- Isaiah 2:5 యెషయా 2:5యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము.
- Matthew 5:44–48 మత్తయి 5:44–48నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
- Psalm 52:1 కీర్తనలు 52:1శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ పడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.