Psalms · chapter 26 · verse 8
Psalm 26:8 in Telugu
యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
Yehovaa, nee nivaasamandiramunu nee tejomahima niluchu sthalamunu nenu preminchuchunnaanu.
Psalm 26:8 in English
- King James Version (KJV)
- LORD, I have loved the habitation of thy house, and the place where thine honour dwelleth.
- World English Bible (WEB)
- LORD, I love the habitation of your house, the place where your glory dwells.
- American Standard Version (ASV)
- Jehovah, I love the habitation of thy house, And the place where thy glory dwelleth.
- Bible in Basic English (BBE)
- Lord, your house has been dear to me, and the resting-place of your glory.
- Darby Translation (DBY)
- Jehovah, I have loved the habitation of thy house, and the place where thy glory dwelleth.
- Webster's Bible (WBS)
- LORD, I have loved the habitation of thy house, and the place where thy honor dwelleth.
- Young's Literal Translation (YLT)
- Jehovah, I have loved the habitation of Thy house, And the place of the tabernacle of Thine honour.
Read in context
- 6నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.
- 7అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.
- 8యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
- 9పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
- 10వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.
Cross references
- Psalm 84:10 కీర్తనలు 84:10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
- John 2:14–17 యోహాను 2:14–17దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి పావురములు అమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
- Psalm 27:4–6 కీర్తనలు 27:4–6యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.
- Psalm 122:9 కీర్తనలు 122:9మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
- Psalm 84:1–2 కీర్తనలు 84:1–2సైన్యములకధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి.
- Luke 2:46 లూకా 2:46మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.
- Isaiah 38:22 యెషయా 38:22మరియు హిజ్కియానేను యెహోవా మందిరమునకు పోయెదననుటకు గురుతేమని యడిగి యుండెను.
- Luke 19:45–47 లూకా 19:45–47ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
- 1 Chronicles 29:3 1 దినవృత్తాంతములు 29:3మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.
- Exodus 40:34–35 నిర్గమకాండము 40:34–35అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
- Luke 2:49 లూకా 2:49ఆయనమీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను;