Psalms · chapter 27 · verse 7
Psalm 27:7 in Telugu
యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము.
Yehovaa, nenu kanthadhvani yetti ninnu praarthinchunappudu naa manavi aalakimpumu karunato naakuttaramimmu.
Psalm 27:7 in English
- King James Version (KJV)
- Hear, O LORD, [when] I cry with my voice: have mercy also upon me, and answer me.
- World English Bible (WEB)
- Hear, LORD, when I cry with my voice. Have mercy also on me, and answer me.
- American Standard Version (ASV)
- Hear, O Jehovah, when I cry with my voice: Have mercy also upon me, and answer me.
- Bible in Basic English (BBE)
- O Lord, let the voice of my cry come to your ears: have mercy on me, and give me an answer.
- Darby Translation (DBY)
- Hear, Jehovah; with my voice do I call; be gracious unto me, and answer me.
- Webster's Bible (WBS)
- Hear, O LORD, [when] I cry with my voice: have mercy also upon me, and answer me.
- Young's Literal Translation (YLT)
- Hear, O Jehovah, my voice — I call, And favour me, and answer me.
Read in context
- 5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
- 6ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.
- 7యెహోవా, నేను కంఠధ్వని యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము.
- 8నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.
- 9నీ ముఖమును నాకు దాచకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము నన్ను విడువకుము
Cross references
- Psalm 130:2–4 కీర్తనలు 130:2–4ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
- Psalm 13:3 కీర్తనలు 13:3యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
- Psalm 5:2 కీర్తనలు 5:2నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
- Psalm 4:1 కీర్తనలు 4:1నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
- Psalm 143:1–2 కీర్తనలు 143:1–2యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపములకు చెవి యొగ్గుము నీ విశ్వాస్యతనుబట్టియు నీ నీతినిబట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచ బడడు.