Psalms · chapter 31 · verse 18
Psalm 31:18 in Telugu
అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
Abaddhikula pedavulu mooyabadunu gaaka. Vaaru garvamunu asahyamunu agaparachuchu neeti mantulameeda kathoramaina maatalu palukuduru.
Psalm 31:18 in English
- King James Version (KJV)
- Let the lying lips be put to silence; which speak grievous things proudly and contemptuously against the righteous.
- World English Bible (WEB)
- Let the lying lips be mute, which speak against the righteous insolently, with pride and contempt.
- American Standard Version (ASV)
- Let the lying lips be dumb, Which speak against the righteous insolently, With pride and contempt.
- Bible in Basic English (BBE)
- Let the false lips be shut, which say evil against the upright, looking down on him in their pride.
- Darby Translation (DBY)
- Let the lying lips become dumb, which speak insolently against the righteous in pride and contempt.
- Webster's Bible (WBS)
- Let the lying lips be put to silence; which speak grievous things proudly and contemptuously against the righteous.
- Young's Literal Translation (YLT)
- Let lips of falsehood become dumb, That are speaking against the righteous, Ancient sayings, in pride and contempt.
Read in context
- 16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము.
- 17యెహోవా, నీకు మొఱ్ఱపెట్టియున్నాను నన్ను సిగ్గు నొందనియ్యకుము భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక; పాతాళమునందు వారు మౌనులై యుందురు గాక.
- 18అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతులమీద కఠోరమైన మాటలు పలుకుదురు.
- 19నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
- 20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
Cross references
- Jude 1:15 యూదా 1:15భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
- Psalm 94:4 కీర్తనలు 94:4వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.
- Isaiah 54:17 యెషయా 54:17నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.
- 1 Samuel 2:3 1 సమూయేలు 2:3యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడుఇకను అంత గర్వముగా మాటలాడకుడిగర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.
- Revelation 22:15 ప్రకటన 22:15కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
- Revelation 21:8 ప్రకటన 21:8పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
- John 8:44 యోహాను 8:44మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
- Psalm 64:3–4 కీర్తనలు 64:3–4ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు
- John 8:48 యోహాను 8:48అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
- Acts 25:7 అపొస్తలుల కార్యములు 25:7పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని ఋజువు చేయలేక పోయిరి.
- Matthew 12:24 మత్తయి 12:24పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
- Psalm 59:12 కీర్తనలు 59:12వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాప మునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.