Psalms · chapter 32 · verse 1
Psalm 32:1 in Telugu
తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
Tana atikramamulaku parihaaramunondinavaadu tana paapamunaku praayashchittamu nondinavaadu dhanyudu.
Psalm 32:1 in English
- King James Version (KJV)
- [A Psalm] of David, Maschil. Blessed [is he whose] transgression [is] forgiven, [whose] sin [is] covered.
- World English Bible (WEB)
- By David. A contemplative psalm. Blessed is he whose disobedience is forgiven, whose sin is covered.
- American Standard Version (ASV)
- [A Psalm] of David. Maschil. Blessed is he whose transgression is forgiven, Whose sin is covered.
- Bible in Basic English (BBE)
- Of David. Maschil. Happy is he who has forgiveness for his wrongdoing, and whose sin is covered.
- Darby Translation (DBY)
- Of David. Instruction. Blessed is he [whose] transgression is forgiven, [whose] sin is covered!
- Webster's Bible (WBS)
- [A Psalm] of David, Maschil. Blessed [is he whose] transgression [is] forgiven, [whose] sin [is] covered.
- Young's Literal Translation (YLT)
- By David. — An Instruction. O the happiness of him whose transgression [is] forgiven, Whose sin is covered.
Read in context
- 1తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
- 2యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
- 3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
Cross references
- Romans 4:6–8 రోమీయులకు 4:6–8ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు,
- Isaiah 44:22 యెషయా 44:22మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.
- Psalm 85:2 కీర్తనలు 85:2నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా. )
- Acts 13:38–39 అపొస్తలుల కార్యములు 13:38–39కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.
- Isaiah 43:25 యెషయా 43:25నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
- Micah 7:18–19 మీకా 7:18–19తన స్వాస్థ్య ములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడ వైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.
- Revelation 22:14 ప్రకటన 22:14జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.
- Isaiah 1:18 యెషయా 1:18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
- Jeremiah 17:7–8 యిర్మీయా 17:7–8యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.
- Psalm 40:4 కీర్తనలు 40:4గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
- Matthew 5:3–12 మత్తయి 5:3–12ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
- Psalm 119:1–2 కీర్తనలు 119:1–2(ఆలెఫ్) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.