Psalms · chapter 35 · verse 14
Psalm 35:14 in Telugu
అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.
Atadu naaku chelikaadainattunu sahodarudainattunu nenu naduchukontini tana talli mrutinondinanduna duhkhavastramulu dharinchu vaanivale krunguchuntini.
Psalm 35:14 in English
- King James Version (KJV)
- I behaved myself as though [he had been] my friend [or] brother: I bowed down heavily, as one that mourneth [for his] mother.
- World English Bible (WEB)
- I behaved myself as though it had been my friend or my brother. I bowed down mourning, as one who mourns his mother.
- American Standard Version (ASV)
- I behaved myself as though it had been my friend or my brother: I bowed down mourning, as one that bewaileth his mother.
- Bible in Basic English (BBE)
- My behaviour was as if it had been my friend or my brother: I was bent low in grief like one whose mother is dead.
- Darby Translation (DBY)
- I behaved myself as though [he had been] a friend, a brother to me; I bowed down in sadness, as one that mourneth [for] a mother.
- Webster's Bible (WBS)
- I behaved myself as though [he had been] my friend [or] brother: I bowed down heavily, as one that mourneth [for his] mother.
- Young's Literal Translation (YLT)
- As [if] a friend, as [if] my brother, I walked habitually, As a mourner for a mother, Mourning I have bowed down.
Read in context
- 12మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.
- 13వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
- 14అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.
- 15నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
- 16విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
Cross references
- Luke 19:41–42 లూకా 19:41–42ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
- 2 Samuel 1:11–12 2 సమూయేలు 1:11–12దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి.
- Genesis 24:67 ఆదికాండము 24:67ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.
- 2 Samuel 1:17–27 2 సమూయేలు 1:17–27యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక. బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు. ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరియుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.
- Psalm 38:6 కీర్తనలు 38:6నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.