Psalms · chapter 37 · verse 35
Psalm 37:35 in Telugu
భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
Bhaktiheenudu ento prabaliyunduta nenu choochi yuntini adi molachina chotane vistarinchina chettuvale vaadu vardhilli yundenu.
Psalm 37:35 in English
- King James Version (KJV)
- I have seen the wicked in great power, and spreading himself like a green bay tree.
- World English Bible (WEB)
- I have seen the wicked in great power, spreading himself like a green tree in its native soil.
- American Standard Version (ASV)
- I have seen the wicked in great power, And spreading himself like a green tree in its native soil.
- Bible in Basic English (BBE)
- I have seen the evil-doer in great power, covering the earth like a great tree.
- Darby Translation (DBY)
- I have seen the wicked in great power, and spreading like a green tree in its native soil:
- Webster's Bible (WBS)
- I have seen the wicked in great power, and spreading himself like a green bay tree.
- Young's Literal Translation (YLT)
- I have seen the wicked terrible, And spreading as a green native plant,
Read in context
- 33వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.
- 34యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.
- 35భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను.
- 36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
- 37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు
Cross references
- Job 5:3 యోబు 5:3మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని.
- Job 21:7–17 యోబు 21:7–17భక్తిహీనులు ఏల బ్రదుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవి దేవుని దండము వారిమీద పడుట లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుట చేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా. వారిమీదికి ఆపదవచ్చుట బహు అరుదు గదా.
- Psalm 73:3–11 కీర్తనలు 73:3–11భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు. ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
- Ezekiel 31:18 యెహెజ్కేలు 31:18కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Isaiah 14:14–19 యెషయా 14:14–19మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా? లోకమును అడవిగాచేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టినవారిని తమ నివాసస్థలమునకు పో నియ్యనివాడు ఇతడేనా? జనముల రాజులందరు ఘనత వహించినవారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు
- Job 8:13–19 యోబు 8:13–19దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
- Esther 5:11 ఎస్తేరు 5:11తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.
- Ezekiel 31:6–10 యెహెజ్కేలు 31:6–10ఆకాశపక్షులన్నియు దాని శాఖలలో గూళ్లుకట్టుకొనెను, భూజంతువులన్నియు దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయెను. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడు నీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్వించెను.
- Daniel 4:20–33 దానియేలు 4:20–33తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును. చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములుమాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను. పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజుబబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయిం చునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభ వించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహమును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను.