Psalms · chapter 38 · verse 3
Psalm 38:3 in Telugu
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
Nee kopaagnivalana aarogyamu naa shareeramunu vidichi poyenu naa paapamunubatti naa yemukalalo svasthataledu.
Psalm 38:3 in English
- King James Version (KJV)
- [There is] no soundness in my flesh because of thine anger; neither [is there any] rest in my bones because of my sin.
- World English Bible (WEB)
- There is no soundness in my flesh because of your indignation, neither is there any health in my bones because of my sin.
- American Standard Version (ASV)
- There is no soundness in my flesh because of thine indignation; Neither is there any health in my bones because of my sin.
- Bible in Basic English (BBE)
- My flesh is wasted because of your wrath; and there is no peace in my bones because of my sin.
- Darby Translation (DBY)
- There is no soundness in my flesh because of thine indignation; no peace in my bones, because of my sin.
- Webster's Bible (WBS)
- [There is] no soundness in my flesh because of thy anger; neither [is there any] rest in my bones because of my sin.
- Young's Literal Translation (YLT)
- Soundness is not in my flesh, Because of Thine indignation, Peace is not in my bones because of my sin.
Read in context
- 1యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.
- 2నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.
- 3నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
- 4నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.
- 5నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
Cross references
- Psalm 6:2 కీర్తనలు 6:2యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
- Psalm 51:8 కీర్తనలు 51:8ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.
- Psalm 31:9–10 కీర్తనలు 31:9–10యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.
- Isaiah 1:5–6 యెషయా 1:5–6నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు.
- Lamentations 3:40–42 విలాపవాక్యములు 3:40–42మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.
- Job 2:7–8 యోబు 2:7–8కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా
- Psalm 102:5 కీర్తనలు 102:5నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.
- Psalm 90:7–8 కీర్తనలు 90:7–8నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
- 2 Chronicles 26:19 2 దినవృత్తాంతములు 26:19ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.
- Job 33:19–22 యోబు 33:19–22వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొనివచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.
- Psalm 102:3 కీర్తనలు 102:3పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.