Psalms · chapter 48 · verse 4
Psalm 48:4 in Telugu
రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
Raajulu koodiri vaaru ekamugaa koodi vachchiri.
Psalm 48:4 in English
- King James Version (KJV)
- For, lo, the kings were assembled, they passed by together.
- World English Bible (WEB)
- For, behold, the kings assembled themselves, they passed by together.
- American Standard Version (ASV)
- For, lo, the kings assembled themselves, They passed by together.
- Bible in Basic English (BBE)
- For see! the kings came together by agreement, they were joined together.
- Darby Translation (DBY)
- For behold, the kings assembled themselves, they passed by together;
- Webster's Bible (WBS)
- For lo, the kings were assembled, they passed by together.
- Young's Literal Translation (YLT)
- For, lo, the kings met, they passed by together,
Read in context
- 2ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది
- 3దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్ష మగుచున్నాడు.
- 4రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.
- 5వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.
- 6వారచ్చటనుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను.
Cross references
- Revelation 17:12–14 ప్రకటన 17:12–14నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
- Revelation 20:8–9 ప్రకటన 20:8–9భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
- 2 Samuel 10:6–19 2 సమూయేలు 10:6–19దావీదు దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిమని అమ్మోనీయులు గ్రహించి దూత లను పంపి, బేత్రెహోబుతోను అరాము సోబాతోను చేరిన సిరియనులలోనుండి యిరువదివేల మంది కాల్బల మును, మయకా రాజు నొద్దనుండి వెయ్యిమంది బంటులను, టోబులోనుండి పండ్రెండు వేలమంది బంటులను జీతమునకు పిలిపించుకొనిరి. దావీదు ఈ సంగతి విని, యోవాబును శూరుల దండంతటిని పంపెను. అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సోబా సిరియనులును రెహోబు సిరియనులును మయకావారును టోబువారును విడిగా పొలములో నిలిచిరి. యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదు ర్కొన బోయెను. అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను. అప్పుడుధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి యోవాబును అతనితోకూడ నున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి. సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను. అయితే సిరియనులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని తెలిసికొని గుంపుకూడిరి. హదదెజరు నదియవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి. హదదెజరు సైన్యాధిపతియగు షోబకు వీరికి అధిపతిగా ఉండెను. దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దానునది దాటి హేలామునకు వచ్చెను. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రా యేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువది వేల మంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతి యగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను. హదదెజరునకు సేవకులగు రాజు లందరు తాము ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేకుండ కొట్టబడియుండుట చూచి ఇశ్రాయేలీయులతో సమా ధానపడి వారికి లోబడిరి. సిరియనులు భయాక్రాంతులై అమ్మోనీయులకు ఇక సహాయముచేయుట మానిరి.
- Isaiah 7:1 యెషయా 7:1యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను
- Psalm 83:2–8 కీర్తనలు 83:2–8నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు. నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయీలును గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. (సెలా. )
- Isaiah 29:5–8 యెషయా 29:5–8నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభవించును. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహ మును దానిమీదను దాని కోటమీదను యుద్ధము చేయువారును దాని బాధపరచువారందరును రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.
- Revelation 19:20 ప్రకటన 19:20అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
- Isaiah 10:8 యెషయా 10:8అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా?
- Isaiah 8:8–10 యెషయా 8:8–10అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.