Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 5 of 150 · 12 verses

Psalm 5 in Telugu

కీర్తనలు 5

  1. యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.

    To the chief Musician upon Nehiloth, A Psalm of David. Give ear to my words, O LORD, consider my meditation.

  2. నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.

    Hearken unto the voice of my cry, my King, and my God: for unto thee will I pray.

  3. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.

    My voice shalt thou hear in the morning, O LORD; in the morning will I direct [my prayer] unto thee, and will look up.

  4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు

    For thou [art] not a God that hath pleasure in wickedness: neither shall evil dwell with thee.

  5. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు

    The foolish shall not stand in thy sight: thou hatest all workers of iniquity.

  6. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

    Thou shalt destroy them that speak leasing: the LORD will abhor the bloody and deceitful man.

  7. నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములోప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను

    But as for me, I will come [into] thy house in the multitude of thy mercy: [and] in thy fear will I worship toward thy holy temple.

  8. యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.

    Lead me, O LORD, in thy righteousness because of mine enemies; make thy way straight before my face.

  9. వారి నోట యథార్థత లేదువారి అంతరంగము నాశనకరమైన గుంటవారి కంఠము తెరచిన సమాధివారు నాలుకతో ఇచ్చకములాడుదురు.

    For [there is] no faithfulness in their mouth; their inward part [is] very wickedness; their throat [is] an open sepulchre; they flatter with their tongue.

  10. దేవా, వారు నీమీద తిరుగబడియున్నారువారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.

    Destroy thou them, O God; let them fall by their own counsels; cast them out in the multitude of their transgressions; for they have rebelled against thee.

  11. నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.

    But let all those that put their trust in thee rejoice: let them ever shout for joy, because thou defendest them: let them also that love thy name be joyful in thee.

  12. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవేకేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవుకావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.

    For thou, LORD, wilt bless the righteous; with favour wilt thou compass him as [with] a shield.

All chapters of Psalms · Telugu Bible · Psalm 5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.