Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 6 of 150 · 10 verses

Psalm 6 in Telugu

కీర్తనలు 6

  1. యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

    To the chief Musician on Neginoth upon Sheminith, A Psalm of David. O LORD, rebuke me not in thine anger, neither chasten me in thy hot displeasure.

  2. యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము

    Have mercy upon me, O LORD; for I [am] weak: O LORD, heal me; for my bones are vexed.

  3. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?

    My soul is also sore vexed: but thou, O LORD, how long?

  4. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.

    Return, O LORD, deliver my soul: oh save me for thy mercies’ sake.

  5. మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?

    For in death [there is] no remembrance of thee: in the grave who shall give thee thanks?

  6. నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.

    I am weary with my groaning; all the night make I my bed to swim; I water my couch with my tears.

  7. విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.

    Mine eye is consumed because of grief; it waxeth old because of all mine enemies.

  8. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.

    Depart from me, all ye workers of iniquity; for the LORD hath heard the voice of my weeping.

  9. యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.

    The LORD hath heard my supplication; the LORD will receive my prayer.

  10. నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

    Let all mine enemies be ashamed and sore vexed: let them return [and] be ashamed suddenly.

All chapters of Psalms · Telugu Bible · Psalm 6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.