Psalms · chapter 50 · verse 3
Psalm 50:3 in Telugu
మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
Mana devudu vencheyuchunnaadu aayana maunamugaa nundadu. Aayana mundara agni manduchunnadi aayanachuttu prachandavaayuvu visaruchunnadi.
Psalm 50:3 in English
- King James Version (KJV)
- Our God shall come, and shall not keep silence: a fire shall devour before him, and it shall be very tempestuous round about him.
- World English Bible (WEB)
- Our God comes, and does not keep silent. A fire devours before him. It is very stormy around him.
- American Standard Version (ASV)
- Our God cometh, and doth not keep silence: A fire devoureth before him, And it is very tempestuous round about him.
- Bible in Basic English (BBE)
- Our God will come, and will not keep quiet; with fire burning before him, and storm-winds round him.
- Darby Translation (DBY)
- Our God will come, and will not keep silence: fire shall devour before him, and it shall be very tempestuous round about him.
- Webster's Bible (WBS)
- Our God shall come, and shall not keep silence: a fire shall devour before him, and it shall be very tempestuous around him.
- Young's Literal Translation (YLT)
- Our God cometh, and is not silent, Fire before Him doth devour, And round about him it hath been very tempestuous.
Read in context
- 1దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.
- 2పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు
- 3మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.
- 4ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
- 5బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.
Cross references
- Numbers 16:35 సంఖ్యాకాండము 16:35మరియు యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణ మును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చివేసెను.
- Daniel 7:10 దానియేలు 7:10అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.
- Leviticus 10:2 లేవీయకాండము 10:2యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.
- Matthew 3:12 మత్తయి 3:12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
- Psalm 97:3–5 కీర్తనలు 97:3–5అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయు చున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
- Hebrews 12:29 హెబ్రీయులకు 12:29ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
- Malachi 4:1 మలాకీ 4:1ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గు లందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 2 Thessalonians 1:8–9 2 థెస్సలొనీకయులకు 1:8–9మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు
- Psalm 48:14 కీర్తనలు 48:14ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును.
- Deuteronomy 9:3 ద్వితీయోపదేశకాండము 9:3కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలిసికొ నుము. ఆయన వారిని నశింపజేసి నీ యెదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్లగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు.
- Psalm 18:7–15 కీర్తనలు 18:7–15అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెనుజలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులు మెండుగా మెరపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగానీ గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను.
- Psalm 68:20 కీర్తనలు 68:20దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.