Psalms · chapter 55 · verse 18
Psalm 55:18 in Telugu
నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
Naa shatruvulu anekulai yunnaaru ayinanu vaaru naameediki raakundunatlu samaadhaanamu kalugajesi aayana naa praanamunu vimochinchi yunnaadu.
Psalm 55:18 in English
- King James Version (KJV)
- He hath delivered my soul in peace from the battle [that was] against me: for there were many with me.
- World English Bible (WEB)
- He has redeemed my soul in peace from the battle that was against me, although there are many who oppose me.
- American Standard Version (ASV)
- He hath redeemed my soul in peace from the battle that was against me; For they were many [that strove] with me.
- Bible in Basic English (BBE)
- He has taken my soul away from the attack which was made against me, and given it peace; for great numbers were against me.
- Darby Translation (DBY)
- He hath redeemed my soul in peace from the battle against me: for there were many about me.
- Webster's Bible (WBS)
- He hath delivered my soul in peace from the battle [that was] against me: for there were many with me.
- Young's Literal Translation (YLT)
- He hath ransomed in peace my soul From him who is near to me, For with the multitude they were with me.
Read in context
- 16అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
- 17సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును
- 18నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.
- 19పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తర మిచ్చును.
- 20తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
Cross references
- Psalm 3:6–7 కీర్తనలు 3:6–7పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
- Psalm 57:3 కీర్తనలు 57:3ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా. )
- Matthew 26:53 మత్తయి 26:53ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొను చున్నావా?
- 1 John 4:4 1 యోహాను 4:4చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
- 2 Samuel 22:1 2 సమూయేలు 22:1యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
- Psalm 27:1–3 కీర్తనలు 27:1–3యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నామీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును.
- 2 Chronicles 32:7–8 2 దినవృత్తాంతములు 32:7–8మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు. మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుట కును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.
- 2 Samuel 18:28 2 సమూయేలు 18:28అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.
- Acts 2:33–36 అపొస్తలుల కార్యములు 2:33–36కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.
- Psalm 118:10–12 కీర్తనలు 118:10–12అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- 2 Kings 6:16 2 రాజులు 6:16అతడుభయ పడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి
- Psalm 56:2 కీర్తనలు 56:2అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు