Psalms · chapter 56 · verse 2
Psalm 56:2 in Telugu
అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు
Anekulu garvinchi naato poraaduchunnaaru dinamella naakoraku ponchiyunnavaaru nannu minga valenani yunnaaru
Psalm 56:2 in English
- King James Version (KJV)
- Mine enemies would daily swallow [me] up: for [they be] many that fight against me, O thou most High.
- World English Bible (WEB)
- My enemies want to swallow me up all day long, for they are many who fight proudly against me.
- American Standard Version (ASV)
- Mine enemies would swallow me up all the day long; For they are many that fight proudly against me.
- Bible in Basic English (BBE)
- My haters are ever ready to put an end to me; great numbers are lifting themselves up against me.
- Darby Translation (DBY)
- Mine enemies would swallow [me] up all the day long; for they are many that fight against me haughtily.
- Webster's Bible (WBS)
- My enemies would daily swallow [me] up: for [they are] many that fight against me, O thou Most High.
- Young's Literal Translation (YLT)
- Mine enemies have swallowed up all the day, For many [are] fighting against me, O most High,
Read in context
- 1దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.
- 2అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు
- 3నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.
- 4దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
Cross references
- Psalm 118:10–12 కీర్తనలు 118:10–12అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను. కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
- Psalm 57:3 కీర్తనలు 57:3ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా. )
- Acts 4:25–27 అపొస్తలుల కార్యములు 4:25–27అన్యజనులు ఏల అల్లరి చేసిరి? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి? ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదను భూరాజులు లేచిరి, అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,
- Psalm 91:1 కీర్తనలు 91:1మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
- Isaiah 57:15 యెషయా 57:15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
- Revelation 16:14 ప్రకటన 16:14అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి
- Psalm 9:2 కీర్తనలు 9:2మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
- Psalm 93:4 కీర్తనలు 93:4విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
- Psalm 3:1 కీర్తనలు 3:1యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు.
- Daniel 5:18 దానియేలు 5:18రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.
- Psalm 54:5 కీర్తనలు 54:5నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను.
- Micah 6:6 మీకా 6:6ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?