Psalms · chapter 6 · verse 9
Psalm 6:9 in Telugu
యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
Yehovaa naa vinnapamu aalakinchi yunnaadu yehovaa naa praarthana nangeekarinchunu.
Psalm 6:9 in English
- King James Version (KJV)
- The LORD hath heard my supplication; the LORD will receive my prayer.
- World English Bible (WEB)
- The LORD has heard my supplication. The LORD accepts my prayer.
- American Standard Version (ASV)
- Jehovah hath heard my supplication; Jehovah will receive my prayer.
- Bible in Basic English (BBE)
- The Lord has given ear to my request; the Lord has let my prayer come before him.
- Darby Translation (DBY)
- Jehovah hath heard my supplication; Jehovah receiveth my prayer.
- Webster's Bible (WBS)
- The LORD hath heard my supplication; the LORD will receive my prayer.
- Young's Literal Translation (YLT)
- Jehovah hath heard my supplication, Jehovah my prayer receiveth.
Read in context
- 7విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
- 8యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
- 9యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.
- 10నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.
Cross references
- Psalm 66:19–20 కీర్తనలు 66:19–20నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
- Psalm 120:1 కీర్తనలు 120:1నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను.
- Psalm 138:3 కీర్తనలు 138:3నేను మొఱ్ఱపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి.
- 2 Corinthians 12:8–10 2 కొరింథీయులకు 12:8–10అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
- Psalm 118:5 కీర్తనలు 118:5ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
- Psalm 40:1–2 కీర్తనలు 40:1–2యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
- Jonah 2:7 యోనా 2:7కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసి కొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.
- 2 Corinthians 1:10–11 2 కొరింథీయులకు 1:10–11ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
- Psalm 116:1–2 కీర్తనలు 116:1–2యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- Jonah 2:2 యోనా 2:2నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవిచేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను; పాతాళగర్భములోనుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన నంగీకరించియున్నావు.
- Psalm 3:4 కీర్తనలు 3:4ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
- Psalm 31:22 కీర్తనలు 31:22భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనలధ్వని నాలకించితివి.