Psalms · chapter 62 · verse 9
Psalm 62:9 in Telugu
అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
Alpulainavaaru vatti oopiriyai yunnaaru. Ghanulainavaaru maayasvaroopulu traasulo vaarandaru telipovuduru vatti oopirikanna alakanagaa unnaaru
Psalm 62:9 in English
- King James Version (KJV)
- Surely men of low degree [are] vanity, [and] men of high degree [are] a lie: to be laid in the balance, they [are] altogether [lighter] than vanity.
- World English Bible (WEB)
- Surely men of low degree are just a breath, and men of high degree are a lie. In the balances they will go up. They are together lighter than a breath.
- American Standard Version (ASV)
- Surely men of low degree are vanity, and men of high degree are a lie: In the balances they will go up; They are together lighter than vanity.
- Bible in Basic English (BBE)
- Truly men of low birth are nothing, and men of high position are not what they seem; if they are put in the scales together they are less than a breath.
- Darby Translation (DBY)
- Men of low degree are only vanity; men of high degree, a lie: laid in the balance, they go up together [lighter] than vanity.
- Webster's Bible (WBS)
- Surely men of low degree [are] vanity, [and] men of high degree [are] a lie: to be laid in the balance, they [are] altogether [lighter] than vanity.
- Young's Literal Translation (YLT)
- Only — vanity [are] the low, a lie the high. In balances to go up they than vanity [are] lighter.
Read in context
- 7నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.
- 8జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మిక యుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము. (సెలా. )
- 9అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
- 10బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
- 11బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను.
Cross references
- Psalm 39:5 కీర్తనలు 39:5నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. )
- Isaiah 40:17 యెషయా 40:17ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.
- Isaiah 40:15 యెషయా 40:15జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
- Psalm 118:9 కీర్తనలు 118:9రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
- Psalm 39:11 కీర్తనలు 39:11దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. )
- Romans 3:4 రోమీయులకు 3:4నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.
- 1 Samuel 23:19–20 1 సమూయేలు 23:19–20జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా
- 1 Samuel 18:5 1 సమూయేలు 18:5దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అను కూలుడై యుండెను.
- 2 Samuel 15:6 2 సమూయేలు 15:6తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయుల కందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.
- 1 Samuel 18:21–26 1 సమూయేలు 18:21–26ఆమె అతనికి ఉరిగానుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొనిఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించిమీరు దావీదుతో రహస్యముగా మాటలాడిరాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదునేను దరిద్రుడనైయెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యము గలవాడైరాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
- 1 Samuel 23:12 1 సమూయేలు 23:12కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవావారు నిన్ను అప్ప గించుదురని సెలవిచ్చెను.
- 2 Samuel 15:31 2 సమూయేలు 15:31అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.