Psalms · chapter 63 · verse 3
Psalm 63:3 in Telugu
నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
Nee krupa jeevamukante uttamamu naa pedavulu ninnu stutinchunu.
Psalm 63:3 in English
- King James Version (KJV)
- Because thy lovingkindness [is] better than life, my lips shall praise thee.
- World English Bible (WEB)
- Because your loving kindness is better than life, my lips shall praise you.
- American Standard Version (ASV)
- Because thy lovingkindness is better than life, My lips shall praise thee.
- Bible in Basic English (BBE)
- Because your mercy is better than life, my lips will give you praise.
- Darby Translation (DBY)
- For thy loving-kindness is better than life: my lips shall praise thee.
- Webster's Bible (WBS)
- Because thy loving-kindness [is] better than life, my lips shall praise thee.
- Young's Literal Translation (YLT)
- Because better [is] Thy kindness than life, My lips do praise Thee.
Read in context
- 1దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
- 2నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
- 3నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
- 4నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
- 5క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
Cross references
- Philippians 1:23 ఫిలిప్పీయులకు 1:23ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
- Psalm 69:16 కీర్తనలు 69:16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
- Psalm 51:15 కీర్తనలు 51:15ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
- Psalm 30:5 కీర్తనలు 30:5ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.
- Hebrews 13:15 హెబ్రీయులకు 13:15కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
- 1 Corinthians 6:20 1 కొరింథీయులకు 6:20విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
- Romans 12:1 రోమీయులకు 12:1కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
- Psalm 30:12 కీర్తనలు 30:12నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.
- James 3:5–10 యాకోబు 3:5–10ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
- 1 John 3:2 1 యోహాను 3:2ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
- Romans 6:19 రోమీయులకు 6:19మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
- Hosea 14:2 హోషేయ 14:2మాటలు సిద్ధ పరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయ నతో చెప్పవలసినదేమనగామా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించు చున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.