Psalms · chapter 64 · verse 2
Psalm 64:2 in Telugu
కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము
Keeducheyuvaari kutranundi dushtakriyalu cheyuvaari allarinundi nannu daachumu
Psalm 64:2 in English
- King James Version (KJV)
- Hide me from the secret counsel of the wicked; from the insurrection of the workers of iniquity:
- World English Bible (WEB)
- Hide me from the conspiracy of the wicked, from the noisy crowd of the ones doing evil;
- American Standard Version (ASV)
- Hide me from the secret counsel of evil-doers, From the tumult of the workers of iniquity;
- Bible in Basic English (BBE)
- Keep me safe from the secret purpose of wrongdoers; from the band of the workers of evil;
- Darby Translation (DBY)
- Hide me from the secret counsel of evil-doers, from the tumultuous crowd of the workers of iniquity,
- Webster's Bible (WBS)
- Hide me from the secret counsel of the wicked; from the insurrection of the workers of iniquity:
- Young's Literal Translation (YLT)
- Hidest me from the secret counsel of evil doers, From the tumult of workers of iniquity.
Read in context
- 1దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.
- 2కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము
- 3ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు.
- 4యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు
Cross references
- Psalm 109:2–3 కీర్తనలు 109:2–3నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
- Psalm 31:20 కీర్తనలు 31:20మనుష్యుల కపటోపాయములు వారి నంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు
- Psalm 59:2 కీర్తనలు 59:2పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.
- Psalm 143:9 కీర్తనలు 143:9యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపింపుము
- Psalm 27:5 కీర్తనలు 27:5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
- Jeremiah 11:19 యిర్మీయా 11:19అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.
- Psalm 3:1 కీర్తనలు 3:1యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు.
- Isaiah 32:2 యెషయా 32:2మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
- Jeremiah 18:23 యిర్మీయా 18:23యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురు గాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము.
- Psalm 2:2 కీర్తనలు 2:2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
- Psalm 56:6 కీర్తనలు 56:6వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.
- Acts 25:3 అపొస్తలుల కార్యములు 25:3మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.