Psalms · chapter 66 · verse 16
Psalm 66:16 in Telugu
దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
Devuniyandu bhayabhaktulugalavaaralaaraa, meerandaru vachchi aalakinchudi aayana naakoraku chesina kaaryamulanu nenu vinipinchedanu.
Psalm 66:16 in English
- King James Version (KJV)
- Come [and] hear, all ye that fear God, and I will declare what he hath done for my soul.
- World English Bible (WEB)
- Come and hear, all you who fear God. I will declare what he has done for my soul.
- American Standard Version (ASV)
- Come, and hear, all ye that fear God, And I will declare what he hath done for my soul.
- Bible in Basic English (BBE)
- Come, give ear to me, all you God-fearing men, so that I may make clear to you what he has done for my soul.
- Darby Translation (DBY)
- Come, hear, all ye that fear God, and I will declare what he hath done for my soul.
- Webster's Bible (WBS)
- Come [and] hear, all ye that fear God, and I will declare what he hath done for my soul.
- Young's Literal Translation (YLT)
- Come, hear, all ye who fear God, And I recount what he did for my soul.
Read in context
- 14నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
- 15పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
- 16దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
- 17ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తన యుండెను.
- 18నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
Cross references
- Psalm 34:11 కీర్తనలు 34:11పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
- Psalm 71:15 కీర్తనలు 71:15నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
- Malachi 3:16 మలాకీ 3:16అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులుకలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.
- Psalm 71:18 కీర్తనలు 71:18దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.
- 1 John 1:3 1 యోహాను 1:3మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.
- Psalm 66:5 కీర్తనలు 66:5దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.
- Psalm 71:20 కీర్తనలు 71:20అనేకమైన కఠినబాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రదికించెదవు భూమియొక్క అగాధ స్థలములలోనుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు.
- 1 Timothy 1:15–16 1 తిమోతికి 1:15–16పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.
- Psalm 71:24 కీర్తనలు 71:24వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.
- Psalm 34:2 కీర్తనలు 34:2యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
- Psalm 22:23–24 కీర్తనలు 22:23–24యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయ నను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.
- Psalm 32:5–6 కీర్తనలు 32:5–6నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. ) కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.