Psalms · chapter 66 · verse 14
Psalm 66:14 in Telugu
నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
Naaku shrama kaliginappudu naa pedavulu palikina mrokkubadulanu naa noru vachinchina mrokkubadulanu nenu neeku chellinchedanu
Psalm 66:14 in English
- King James Version (KJV)
- Which my lips have uttered, and my mouth hath spoken, when I was in trouble.
- World English Bible (WEB)
- which my lips promised, and my mouth spoke, when I was in distress.
- American Standard Version (ASV)
- Which my lips uttered, And my mouth spake, when I was in distress.
- Bible in Basic English (BBE)
- Keeping the word which came from my lips, and which my mouth said, when I was in trouble.
- Darby Translation (DBY)
- Which my lips have uttered, and my mouth hath spoken, when I was in trouble.
- Webster's Bible (WBS)
- Which my lips have uttered, and my mouth hath spoken, when I was in trouble.
- Young's Literal Translation (YLT)
- For opened were my lips, And my mouth spake in my distress:
Read in context
- 12నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితివిు అయినను నీవు సమృధ్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు.
- 13దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.
- 14నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
- 15పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱెలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను. (సెలా).
- 16దేవునియందు భయభక్తులుగలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.
Cross references
- Judges 11:35–36 న్యాయాధిపతులు 11:35–36కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపు కొని అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా ఆమెనా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీ యులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితో ననెను.
- 1 Samuel 1:11 1 సమూయేలు 1:11సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
- Psalm 18:6 కీర్తనలు 18:6నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
- 2 Samuel 22:7 2 సమూయేలు 22:7నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
- Numbers 30:2 సంఖ్యాకాండము 30:2ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చ వలెను.
- Numbers 30:8 సంఖ్యాకాండము 30:8ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టు కొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.
- Genesis 28:20–22 ఆదికాండము 28:20–22అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
- Genesis 35:3 ఆదికాండము 35:3మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.
- Numbers 30:12 సంఖ్యాకాండము 30:12ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.