Skip to content
ThuthiThuthiThuthi
Psalms · chapter 67 of 150 · 7 verses

Psalm 67 in Telugu

కీర్తనలు 67

  1. భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును

    To the chief Musician on Neginoth, A Psalm [or] Song. God be merciful unto us, and bless us; [and] cause his face to shine upon us; Selah.

  2. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక. (సెలా. )

    That thy way may be known upon earth, thy saving health among all nations.

  3. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా. )

    Let the people praise thee, O God; let all the people praise thee.

  4. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

    O let the nations be glad and sing for joy: for thou shalt judge the people righteously, and govern the nations upon earth. Selah.

  5. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

    Let the people praise thee, O God; let all the people praise thee.

  6. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.

    [Then] shall the earth yield her increase; [and] God, [even] our own God, shall bless us.

  7. దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

    God shall bless us; and all the ends of the earth shall fear him.

All chapters of Psalms · Telugu Bible · Psalm 67 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.