Psalms · chapter 68 · verse 14
Psalm 68:14 in Telugu
సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.
Sarvashaktudu akkada raajulanu chedaragottinappudu salmonumeeda himamu kurisinatlaayenu.
Psalm 68:14 in English
- King James Version (KJV)
- When the Almighty scattered kings in it, it was [white] as snow in Salmon.
- World English Bible (WEB)
- When the Almighty scattered kings in her, it snowed on Zalmon.
- American Standard Version (ASV)
- When the Almighty scattered kings therein, [It was as when] it snoweth in Zalmon.
- Bible in Basic English (BBE)
- When the Most High put the kings to flight, it was as white as snow in Salmon.
- Darby Translation (DBY)
- When the Almighty scattered kings in it, it became snow-white as Zalmon.
- Webster's Bible (WBS)
- When the Almighty scattered kings in it, it was [white] as snow in Salmon.
- Young's Literal Translation (YLT)
- When the Mighty spreadeth kings in it, It doth snow in Salmon.
Read in context
- 12సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
- 13గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
- 14సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.
- 15బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
- 16శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.
Cross references
- Isaiah 1:18 యెషయా 1:18యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లని వగును.
- Judges 2:7 న్యాయాధిపతులు 2:7యెహోషువ దినములన్నిటను యెహో షువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రా యేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.
- Psalm 51:7 కీర్తనలు 51:7నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
- Judges 9:48 న్యాయాధిపతులు 9:48అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
- Joshua 10:10–43 యెహోషువ 10:10–43అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులయిదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో దాగియుండిరి. మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులయిదుగురు దొరికిరని యెహోషు వకు తెలుపబడినప్పుడు యెహోషువఆ గుహ ద్వార మున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. మీ దేవు డైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరల వెళ్లనీయకుండ మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటివారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించువరకు యెహోషువయు ఇశ్రా యేలీయులును బహు జనసంహారముచేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారముగల పట్టణములలో చొచ్చిరి. జనులందరు మక్కేదాయందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైన ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువఆ గుహకు అడ్డము తీసివేసి గుహలోనుండి ఆ అయిదుగురు రాజులను నాయొద్దకు తీసికొనిరండని చెప్పగా వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి. వారు ఆ రాజు లను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసికొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులనందరిని పిలి పించి, తనతో యుద్ధమునకు వెళ్లివచ్చిన యోధుల అధిపతు లతోమీరు దగ్గరకు రండి; ఈ రాజుల మెడలమీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడలమీద తమ పాదములనుంచిరి. అప్పుడు యెహోషువ వారితోమీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగానుండుడి; మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను. ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయు లందరును మక్కేదానుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధముచేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతట యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును లిబ్నానుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషువారితో యుద్ధముచేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతముచేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును లాకీషునుండి ఎగ్లోనునకును వచ్చి దానియెదుట దిగి దాని నివాసులతో యుద్ధముచేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో నున్నవారి నందరిని ఆ దినము నిర్మూలముచేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరును ఎగ్లోనునుండి హెబ్రోనుమీదికి పోయి దాని జనులతో యుద్ధముచేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతముచేసిరి. అతడు ఎగ్లో నుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరిని నిర్మూ లము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజావరకు గిబియోనువరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రా యేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నంద రిని వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టు కొనెను. తరువాత యెహోషువయు అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి.
- Revelation 19:14–21 ప్రకటన 19:14–21పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి–రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
- Jeremiah 2:3 యిర్మీయా 2:3అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితజనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయెను, అతని లయపరచువారందరు శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును; ఇదే యెహోవా వాక్కు.
- Joshua 12:1–24 యెహోషువ 12:1–24ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల నున్న అర్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతముచేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి, అర్నోను ఏటి తీరము నందలి అరోయేరునుండి, అనగా ఆ యేటిలోయ నడుమనుండి గిలాదు అర్ధభాగ మును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయవరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమువ రకును, తూర్పు దిక్కున బెత్యేషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోనురాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్దభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులును వారిని హతముచేసి, యెహోవా సేవకుడైన మోషే రూబే నీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాని నిచ్చెను. యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయ ల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీ యులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలాప్రదే శములోను చరియలప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయు లను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టు కొనిరి. వారెవరనగా యెరికో రాజు బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లష్షారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు. కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు, ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
- Numbers 21:3 సంఖ్యాకాండము 21:3యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
- Numbers 21:21–35 సంఖ్యాకాండము 21:21–35ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.