Psalms · chapter 72 · verse 10
Psalm 72:10 in Telugu
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
Tarsheeshu raajulu dveepamula raajulu kappamu chellinchedaru shebaraajulunu sebaaraajulunu kaanukalu teesikoni vachchedaru.
Psalm 72:10 in English
- King James Version (KJV)
- The kings of Tarshish and of the isles shall bring presents: the kings of Sheba and Seba shall offer gifts.
- World English Bible (WEB)
- The kings of Tarshish and of the islands will bring tribute. The kings of Sheba and Seba shall offer gifts.
- American Standard Version (ASV)
- The kings of Tarshish and of the isles shall render tribute: The kings of Sheba and Seba shall offer gifts.
- Bible in Basic English (BBE)
- Let the kings of Tarshish and of the islands come back with offerings; let the kings of Sheba and Seba give of their stores.
- Darby Translation (DBY)
- The kings of Tarshish and of the isles shall render presents; the kings of Sheba and Seba shall offer tribute:
- Webster's Bible (WBS)
- The kings of Tarshish and of the isles shall bring presents: the kings of Sheba and Seba shall offer gifts.
- Young's Literal Translation (YLT)
- Kings of Tarshish and of the isles send back a present. Kings of Sheba and Seba a reward bring near.
Read in context
- 8సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.
- 9అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
- 10తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
- 11రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.
- 12దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.
Cross references
- Psalm 68:29 కీర్తనలు 68:29యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.
- Isaiah 60:6 యెషయా 60:6ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాల లేత ఒంటె లును నీ దేశముమీద వ్యాపించును వారందరు షేబనుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసికొనివచ్చెదరు యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు.
- Isaiah 49:7 యెషయా 49:7ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనె ననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.
- Psalm 45:12 కీర్తనలు 45:12తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు.
- 1 Kings 10:1 1 రాజులు 10:1షేబదేశపురాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తినిగూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
- Isaiah 60:9 యెషయా 60:9నీ దేవుడైన యెహోవా నామమునుబట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధదేవుని నామమునుబట్టి దూరమునుండి నీ కుమారులను తమ వెండి బంగారము లను తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి.
- 2 Chronicles 9:21 2 దినవృత్తాంతములు 9:21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను
- Genesis 10:7 ఆదికాండము 10:7కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
- Isaiah 43:3 యెషయా 43:3యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.
- Matthew 2:11 మత్తయి 2:11తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
- Isaiah 60:3 యెషయా 60:3జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
- Isaiah 42:4 యెషయా 42:4భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.