Psalms · chapter 79 · verse 6
Psalm 79:6 in Telugu
నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము.
Ninnerugani anyajanulameedanu nee naamamunubatti praarthanacheyani raajyamulameedanu nee ugratanu kummarinchumu.
Psalm 79:6 in English
- King James Version (KJV)
- Pour out thy wrath upon the heathen that have not known thee, and upon the kingdoms that have not called upon thy name.
- World English Bible (WEB)
- Pour out your wrath on the nations that don’t know you, on the kingdoms that don’t call on your name,
- American Standard Version (ASV)
- Pour out thy wrath upon the nations that know thee not, And upon the kingdoms that call not upon thy name.
- Bible in Basic English (BBE)
- Let your wrath be on the nations who have no knowledge of you, and on the kingdoms who have not made prayer to your name.
- Darby Translation (DBY)
- Pour out thy fury upon the nations that have not known thee, and upon the kingdoms that call not upon thy name:
- Webster's Bible (WBS)
- Pour out thy wrath upon the heathen that have not known thee, and upon the kingdoms that have not called upon thy name.
- Young's Literal Translation (YLT)
- Pour Thy fury on the nations who have not known Thee, And on kingdoms that have not called in Thy name.
Read in context
- 4మా పొరుగువారికి మేము అసహ్యులమైతివిు మా చుట్టునున్నవారు మమ్ము నపహసించి యెగతాళి చేసెదరు.
- 5యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా?
- 6నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థనచేయని రాజ్యములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము.
- 7వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడుచేసియున్నారు
- 8మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
Cross references
- Jeremiah 10:25 యిర్మీయా 10:25నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థింపని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.
- 2 Thessalonians 1:8 2 థెస్సలొనీకయులకు 1:8మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
- Psalm 14:4 కీర్తనలు 14:4యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
- Psalm 69:24 కీర్తనలు 69:24వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
- Psalm 53:4 కీర్తనలు 53:4దేవునికి ప్రార్థనచేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా?
- Isaiah 45:4–5 యెషయా 45:4–5నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరుపెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికిని నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- Psalm 9:16–17 కీర్తనలు 9:16–17యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాముచేసికొనిన దానిలో చిక్కియున్నారు(హిగ్గాయోన్ సెలా. ) దుష్టులును దేవుని మరచు జనులందరునుపాతాళమునకు దిగిపోవుదురు.
- Zephaniah 3:8 జెఫన్యా 3:8కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.
- John 16:3 యోహాను 16:3వారు తండ్రిని నన్నును తెలిసికొన లేదు గనుక ఈలాగు చేయుదురు.
- Isaiah 21:1–17 యెషయా 21:1–17సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది. కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను. జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడుముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను. తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించు వారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.
- Jeremiah 25:29 యిర్మీయా 25:29నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.