Psalms · chapter 8 · verse 5
Psalm 8:5 in Telugu
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
Devunikante vaanini konchemu takkuvavaanigaa chesiyunnaavu. Mahimaa prabhaavamulato vaaniki kireetamu dharimpajesi yunnaavu.
Psalm 8:5 in English
- King James Version (KJV)
- For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honour.
- World English Bible (WEB)
- For you have made him a little lower than the angels, and crowned him with glory and honor.
- American Standard Version (ASV)
- For thou hast made him but little lower than God, And crownest him with glory and honor.
- Bible in Basic English (BBE)
- For you have made him only a little lower than the gods, crowning him with glory and honour.
- Darby Translation (DBY)
- Thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and splendour.
- Webster's Bible (WBS)
- For thou hast made him a little lower than the angels, and hast crowned him with glory and honor.
- Young's Literal Translation (YLT)
- And causest him to lack a little of Godhead, And with honour and majesty compassest him.
Read in context
- 3నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా
- 4నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
- 5దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.
- 6నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చి యున్నావు.
- 7గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను
Cross references
- Hebrews 2:7 హెబ్రీయులకు 2:7నీవు దేవదూతలకంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసితివి మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింప జేసితివి నీ చేతి పనులమీద వానికధికారము అనుగ్రహించితివి వాని పాదములక్రింద సమస్తమును ఉంచితివి.
- Hebrews 2:9 హెబ్రీయులకు 2:9దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము
- Genesis 1:26–27 ఆదికాండము 1:26–27దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
- Philippians 2:7–11 ఫిలిప్పీయులకు 2:7–11మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
- Hebrews 2:16 హెబ్రీయులకు 2:16ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
- Ephesians 1:21 ఎఫెసీయులకు 1:21గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
- Psalm 21:3–5 కీర్తనలు 21:3–5శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు. నీ రక్షణవలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు.
- Psalm 103:4 కీర్తనలు 103:4సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు
- 1 Peter 1:20–21 1 పేతురు 1:20–21ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియ మింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి. మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు,
- Genesis 2:7 ఆదికాండము 2:7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
- Psalm 103:20 కీర్తనలు 103:20యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
- Psalm 45:1–3 కీర్తనలు 45:1–3ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది. నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము.