Psalms · chapter 80 · verse 2
Psalm 80:2 in Telugu
ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము.
Ephraayimu benyaameenu manashshe anuvaari yeduta nee paraakramamunu melkolipi mammunu rakshimpa rammu.
Psalm 80:2 in English
- King James Version (KJV)
- Before Ephraim and Benjamin and Manasseh stir up thy strength, and come [and] save us.
- World English Bible (WEB)
- Before Ephraim, Benjamin, and Manasseh, stir up your might! Come to save us!
- American Standard Version (ASV)
- Before Ephraim and Benjamin and Manasseh, stir up thy might, And come to save us.
- Bible in Basic English (BBE)
- Before Ephraim and Benjamin and Manasseh, let your strength be awake from sleep, and come as our salvation.
- Darby Translation (DBY)
- Before Ephraim and Benjamin and Manasseh, stir up thy strength, and come to our deliverance.
- Webster's Bible (WBS)
- Before Ephraim and Benjamin and Manasseh stir up thy strength, and come [and] save us.
- Young's Literal Translation (YLT)
- Before Ephraim, and Benjamin, and Manasseh, Wake up Thy might, and come for our salvation.
Read in context
- 1ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబులమీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము.
- 2ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింప రమ్ము.
- 3దేవా, చెరలోనుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప జేయుము.
- 4యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్లు నీ కోపము పొగరాజనిచ్చెదవు?
Cross references
- Psalm 35:23 కీర్తనలు 35:23నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.
- Numbers 2:18–24 సంఖ్యాకాండము 2:18–24ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారు డైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది. అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీ యేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండు వేల రెండువందలమంది. అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది. ఎఫ్రాయిము పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.
- Isaiah 42:13–14 యెషయా 42:13–14యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
- Psalm 44:23–26 కీర్తనలు 44:23–26ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు? మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.
- Psalm 78:38 కీర్తనలు 78:38అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
- Isaiah 33:22 యెషయా 33:22యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.
- Numbers 10:22–24 సంఖ్యాకాండము 10:22–24ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యము నకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.
- Isaiah 25:9 యెషయా 25:9ఆ దినమున జనులీలాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.