Psalms · chapter 81 · verse 3
Psalm 81:3 in Telugu
అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.
Amaavaasyanaadu kommu oodudi manamu panduga aacharinchu dinamagu punnamanaadu kommu oodudi.
Psalm 81:3 in English
- King James Version (KJV)
- Blow up the trumpet in the new moon, in the time appointed, on our solemn feast day.
- World English Bible (WEB)
- Blow the trumpet at the New Moon, at the full moon, on our feast day.
- American Standard Version (ASV)
- Blow the trumpet at the new moon, At the full moon, on our feast-day.
- Bible in Basic English (BBE)
- Let the horn be sounded in the time of the new moon, at the full moon, on our holy feast-day:
- Darby Translation (DBY)
- Blow the trumpet at the new moon, at the set time, on our feast day:
- Webster's Bible (WBS)
- Blow the trumpet in the new moon, in the time appointed, on our solemn feast day.
- Young's Literal Translation (YLT)
- Blow in the month a trumpet, In the new moon, at the day of our festival,
Read in context
- 1మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.
- 2కీర్తన యెత్తుడి గిలకతప్పెట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి.
- 3అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.
- 4అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము.
- 5ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని.
Cross references
- Leviticus 23:24–25 లేవీయకాండము 23:24–25నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాప కార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుటమాని యెహోవాకు హోమము చేయవలెను.
- Numbers 15:3 సంఖ్యాకాండము 15:3యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల
- 2 Chronicles 2:4 2 దినవృత్తాంతములు 2:4నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.
- 2 Chronicles 13:14 2 దినవృత్తాంతములు 13:14యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.
- Deuteronomy 16:15 ద్వితీయోపదేశకాండము 16:15నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
- Numbers 10:1–10 సంఖ్యాకాండము 10:1–10యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము; నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను. మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్య ములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చునప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్య మైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధ ముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవు డైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
- 1 Chronicles 16:6 1 దినవృత్తాంతములు 16:6బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
- Nahum 1:15 నహూము 1:15సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
- 2 Kings 4:23 2 రాజులు 4:23అతడునేడు అమావాస్య కాదే; విశ్రాంతి దినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమెనేను పోవుట మంచిదని చెప్పి
- 1 Chronicles 16:42 1 దినవృత్తాంతములు 16:42బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.
- Psalm 98:6 కీర్తనలు 98:6బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వనిచేయుడి.
- 2 Chronicles 13:12 2 దినవృత్తాంతములు 13:12ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.