Psalms · chapter 9 · verse 2
Psalm 9:2 in Telugu
మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
Mahonnatudaa, nenu ninnugoorchi santoshinchiharshinchuchunnaanu nee naamamunu keertinchedanu.
Psalm 9:2 in English
- King James Version (KJV)
- I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High.
- World English Bible (WEB)
- I will be glad and rejoice in you. I will sing praise to your name, O Most High.
- American Standard Version (ASV)
- I will be glad and exult in thee; I will sing praise to thy name, O thou Most High.
- Bible in Basic English (BBE)
- I will be glad and have delight in you: I will make a song of praise to your name, O Most High.
- Darby Translation (DBY)
- I will be glad and rejoice in thee; I will sing forth thy name, O Most High.
- Webster's Bible (WBS)
- I will be glad and rejoice in thee: I will sing praise to thy name, O thou most High.
- Young's Literal Translation (YLT)
- I rejoice and exult in Thee, I praise Thy Name, O Most High.
Read in context
- 1నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివరించెదను.
- 2మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించిహర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
- 3నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పుతీర్చుచున్నావు
- 4కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురునీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.
Cross references
- Psalm 83:18 కీర్తనలు 83:18యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
- Psalm 5:11 కీర్తనలు 5:11నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురునీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యముఆనందధ్వని చేయుదురు.
- Psalm 7:17 కీర్తనలు 7:17యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను.
- Psalm 97:9 కీర్తనలు 97:9ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
- Psalm 28:7 కీర్తనలు 28:7యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
- Psalm 92:1 కీర్తనలు 92:1యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,
- Philippians 4:4 ఫిలిప్పీయులకు 4:4ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పు దును ఆనందించుడి.
- Psalm 97:12 కీర్తనలు 97:12నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.
- Habakkuk 3:17–18 హబక్కూకు 3:17–18అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.
- Psalm 27:6 కీర్తనలు 27:6ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.
- Daniel 5:18 దానియేలు 5:18రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.
- Psalm 43:4 కీర్తనలు 43:4అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందసంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను