Psalms · chapter 91 · verse 4
Psalm 91:4 in Telugu
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
Aayana tana rekkalato ninnu kappunu aayana rekkala krinda neeku aashrayamu kalugunu aayana satyamu, kedemunu daalunai yunnadi.
Psalm 91:4 in English
- King James Version (KJV)
- He shall cover thee with his feathers, and under his wings shalt thou trust: his truth [shall be thy] shield and buckler.
- World English Bible (WEB)
- He will cover you with his feathers. Under his wings you will take refuge. His faithfulness is your shield and rampart.
- American Standard Version (ASV)
- He will cover thee with his pinions, And under his wings shalt thou take refuge: His truth is a shield and a buckler.
- Bible in Basic English (BBE)
- You will be covered by his feathers; under his wings you will be safe: his good faith will be your salvation.
- Darby Translation (DBY)
- He shall cover thee with his feathers, and under his wings shalt thou find refuge: his truth is a shield and buckler.
- Webster's Bible (WBS)
- He shall cover thee with his feathers, and under his wings shalt thou trust: his truth [shall be thy] shield and buckler.
- Young's Literal Translation (YLT)
- With His pinion He covereth thee over, And under His wings thou dost trust, A shield and buckler [is] His truth.
Read in context
- 2ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
- 3వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
- 4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
- 5రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
- 6చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
Cross references
- Psalm 61:4 కీర్తనలు 61:4యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా. )
- Psalm 57:1 కీర్తనలు 57:1నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.
- Psalm 17:8 కీర్తనలు 17:8నీ కృపాతిశయములను చూపుము.
- Deuteronomy 32:11 ద్వితీయోపదేశకాండము 32:11పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.
- Isaiah 43:1–2 యెషయా 43:1–2అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు
- Matthew 23:37 మత్తయి 23:37యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
- Psalm 35:2 కీర్తనలు 35:2కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.
- Genesis 15:1 ఆదికాండము 15:1ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.
- Ruth 2:12 రూతు 2:12యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.
- Hebrews 6:17–18 హెబ్రీయులకు 6:17–18ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
- Titus 1:2 తీతుకు 1:2నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో
- Mark 13:31 మార్కు 13:31ఆకాశమును భూమియును గతించునుగాని నా మాటలు గతింపవు.