Psalms · chapter 61 · verse 4
Psalm 61:4 in Telugu
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా. )
Yugayugamulu nenu nee gudaaramulo nivasinchedanu nee rekkala chaatuna daagukondunu (selaa. )
Psalm 61:4 in English
- King James Version (KJV)
- I will abide in thy tabernacle for ever: I will trust in the covert of thy wings. Selah.
- World English Bible (WEB)
- I will dwell in your tent forever. I will take refuge in the shelter of your wings. Selah.
- American Standard Version (ASV)
- I will dwell in thy tabernacle for ever: I will take refuge in the covert of thy wings. [Selah
- Bible in Basic English (BBE)
- I will make your tent my resting-place for ever: I will keep myself under the cover of your wings. (Selah.)
- Darby Translation (DBY)
- I will sojourn in thy tent for ever; I will take refuge in the covert of thy wings. Selah.
- Webster's Bible (WBS)
- I will abide in thy tabernacle for ever: I will trust in the covert of thy wings. Selah.
- Young's Literal Translation (YLT)
- I sojourn in Thy tent to the ages, I trust in the secret place of Thy wings. Selah.
Read in context
- 2నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.
- 3నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
- 4యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా. )
- 5దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.
- 6రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచును గాక.
Cross references
- Psalm 23:6 కీర్తనలు 23:6నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
- Psalm 27:4 కీర్తనలు 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
- Psalm 17:8 కీర్తనలు 17:8నీ కృపాతిశయములను చూపుము.
- Psalm 91:4 కీర్తనలు 91:4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
- Psalm 63:7 కీర్తనలు 63:7నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
- Ruth 2:12 రూతు 2:12యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.
- Psalm 15:1 కీర్తనలు 15:1యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
- Psalm 57:1 కీర్తనలు 57:1నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చి యున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను.
- Psalm 91:1 కీర్తనలు 91:1మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
- Matthew 23:37 మత్తయి 23:37యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
- Psalm 62:7 కీర్తనలు 62:7నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము నా యాశ్రయము దేవునియందే యున్నది.
- Psalm 142:4–5 కీర్తనలు 142:4–5నా కుడిప్రక్కను నిదానించి చూడుము నన్నెరిగినవాడు ఒకడును నాకు లేకపోయెను ఆశ్రయమేదియు నాకు దొరకలేదు నాయెడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమిమీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని.