Psalms · chapter 92 · verse 9
Psalm 92:9 in Telugu
నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
Nee shatruvulu yehovaa, nee shatruvulu nashinchedaru chedupanulu cheyuvaarandaru chedaripovuduru.
Psalm 92:9 in English
- King James Version (KJV)
- For, lo, thine enemies, O LORD, for, lo, thine enemies shall perish; all the workers of iniquity shall be scattered.
- World English Bible (WEB)
- For behold, your enemies, LORD, for behold, your enemies shall perish. All the evildoers will be scattered.
- American Standard Version (ASV)
- For, lo, thine enemies, O Jehovah, For, lo, thine enemies shall perish; All the workers of iniquity shall be scattered.
- Bible in Basic English (BBE)
- For see! your haters, O Lord, will be put to death; all the workers of evil will be put to flight;
- Darby Translation (DBY)
- For lo, thine enemies, O Jehovah, for lo, thine enemies shall perish; all the workers of iniquity shall be scattered.
- Webster's Bible (WBS)
- For lo, thy enemies, O LORD, for lo, thy enemies shall perish; all the workers of iniquity shall be scattered.
- Young's Literal Translation (YLT)
- For, lo, Thine enemies, O Jehovah, For, lo, Thine enemies, do perish, Separate themselves do all workers of iniquity.
Read in context
- 7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- 8యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు
- 9నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు చెడుపనులు చేయువారందరు చెదరిపోవుదురు.
- 10గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
- 11నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచినదుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
Cross references
- Psalm 37:20 కీర్తనలు 37:20భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.
- Psalm 89:10 కీర్తనలు 89:10చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.
- 2 Thessalonians 1:7–9 2 థెస్సలొనీకయులకు 1:7–9దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు
- Psalm 68:1–2 కీర్తనలు 68:1–2దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక. పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
- Psalm 21:8–9 కీర్తనలు 21:8–9నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురుతన కోపమువలన యెహోవా వారిని నిర్మూలముచేయును అగ్ని వారిని దహించును.
- Matthew 7:23 మత్తయి 7:23అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
- Isaiah 17:13 యెషయా 17:13జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.
- Ezekiel 5:12 యెహెజ్కేలు 5:12కరవు వచ్చి యుండగా నీలో మూడవ భాగము తెగులుచేత మరణ మవును, మూడవ భాగము ఖడ్గముచేత నీ చుట్టు కూలును, నేను కత్తి దూసిి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును.
- Psalm 73:27 కీర్తనలు 73:27నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహరించెదవు.
- Numbers 10:35 సంఖ్యాకాండము 10:35ఆ మందసము సాగినప్పుడు మోషేయెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.
- Psalm 59:11 కీర్తనలు 59:11వారిని చంపకుము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో. మాకేడెమైన ప్రభువా, నీ బలముచేత వారిని చెల్లా చెదరు చేసి అణగగొట్టుము.
- Leviticus 26:33 లేవీయకాండము 26:33జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.